Video Viral: డ్రైవర్ వేధింపులు.. చెప్పుతో కొట్టిన మాజీ సీఎం కూతురు వీడియో వైరల్! అసలు విషయం తెలిస్తే..

Ex CM Daughter Video Viral: అసోం మాజీ ముఖ్యమంత్రి ప్రఫుల్లా కుమార్‌ మహంతా (Prafulla Kumar Mahanta) కూతురు వైరల్‌ వీడియో నెట్టింటా వైరల్‌ అవుతుంది. ఆమె తన కారు డ్రైవర్‌ను చెప్పుతో కొడుతూ ఉంది. ఈ ఘటనను వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. అది వైరల్‌ అవుతుంది.  

Written by - Renuka Godugu | Last Updated : Mar 4, 2025, 11:54 AM IST
Video Viral: డ్రైవర్ వేధింపులు.. చెప్పుతో కొట్టిన మాజీ సీఎం కూతురు వీడియో వైరల్! అసలు విషయం తెలిస్తే..

Ex CM Daughter Video Viral: సోషల్‌ మీడియాలో ఏదైనా వీడియో కనిపిస్తే అది వైరల్‌ అయిపోతుంది. ఏకంగా మాజీ సీఎం కూతురుకు సంబంధించిన వీడియో అంటే ఇక ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అసోం మాజీ ముఖ్యమంత్రి ప్రఫుల్లా కుమార్ మహంతా (Prafulla Kumar Mahanta) కూతురుకు సంబంధించిన వీడియో ఒక్కటి నెట్టింటా బాగా వైరల్‌ అవుతుంది. ఈ వీడియోలో ఆమె ఒక వ్యక్తిని చెప్పుతో కొడుతూ ఉంది. ఇందులో ఆ వ్యక్తి మోకాళ్లపై కూర్చుని ఉన్నాడు. ఈ ఘటనను ఎవరో వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టారు. అది కాస్త బాగా వైరల్‌ అవుతూ ఉంది.

Add Zee News as a Preferred Source

ఈ ఘటన అసోం రాజధాని అయిన డిస్పూర్‌లోని ఎమ్మెల్యే గెస్ట్‌ హౌస్‌లో జరిగింది. దీనిపై ఆ మాజీ ముఖ్యమంత్రి కూతురు కూడా వివరణ ఇచ్చారు. అయితే, సదరు వ్యక్తి తన నాన్న కారు డ్రైవర్‌ ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నాడు. ఎప్పటి నుంచో తాగుడు అలవాటు ఉంది. ఎన్నిసార్లు చెప్పినా వినకుండా తాగి విధులకు వస్తున్నాడు. సోమవారం కూడా ఉదయం అతిగా మద్యం సేవించి నేరుగా తన బెడ్‌రూమ్‌ తలుపు తట్టాడు అని చెప్పుకొచ్చారు. 

ఇదీ చదవండి:   తెల్ల డ్రెస్‌లో తమన్నా గ్లామర్‌ ట్రీట్‌.. కుర్ర కారును ఫిదా చేసే కిల్లింగ్‌ ఫోటోస్‌..!  

మద్యం సేవించి రాకూడదని ఎన్నిసార్లు బుద్ధిచెప్పినా వినటం లేదని, ఇక సోమవారం ఉదయం ఏకంగా తన బెడ్‌రూమ్‌ తలుపు తట్టడంతో ఓపిక నశించి ఎలాగైనా అతడికి ఈసారి తగిన బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో అతడిని క్వార్టర్స్‌ బయటకు తీసుకువచ్చి ఇలా మోకాళ్లపై నిలబెట్టి చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, విలేకరులు మాత్రం ఇలా గొడవ చేసిన ప్రతిసారి పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు?. లేకపోతే అతడిని విధుల నుంచి ఎందుకు తొలగించలేదు? అని ప్రశ్నించారు. దీనికి ఆమె మీరు ఇలాగే సలహాలు, సూచనలు ఇస్తారు. లేకపోతే మహిళలపైనే నిందలు వేస్తారు అని మాట దాటవేశారు.

ఇదీ చదవండి: టన్నెల్‌ చివరి వరకు వెళ్లిన ఆర్మీ రెస్క్యూ టీమ్‌.. 'ఆ 8 మంది చనిపోయి ఉంటారు'..

 

 

ఇదిలా ఉండగా ప్రఫుల్లా కుమార్‌ మహంతా రాష్ట్ర ప్రధాన పార్టీ అయిన అసోం గణ పరిషద్‌ (AGP) మాజీ అధ్యక్షుడు. ఈయన అసోం రాష్ట్రానికి రెండుసార్లు సీఎంగా పనిచేశారు. ఇటీవలె పార్టీలో విభేదాల తర్వా ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2021 నుంచి రాజకీయలకు అంత క్రియాశీలంగా కూడా పనిచేయడం లేదు. అయితే, ఆయన మాత్రం కుటుంబంతోపాటు ఇంకా ఆ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోనే ఉండటం గమనార్హం. ప్రఫుల్లా కుమార్‌ మహంతీ 1985- 1990, 1996-2001  మధ్య రెండు సార్లు అసోంకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే, ప్రస్తుతం ఈయన శాసన సభ్యుడు కూడా కాదు. ఇక సోషల్‌ మీడియాలో సెలబ్రెటీలు, రాజకీయ నేతలు వారి కుటుంబాలకు సంబంధించిన వీడియోలు త్వరగా వైరల్‌ అవుతుంటాయి. ఈ ఘటనపై నెట్టిజెన్లు సైతం పలు విధాలుగా స్పందిస్తున్నారు. ఈ ఘటను సంబంధించిన వీడియో ఎక్స్‌ వేధికగా వైరల్‌ అవుతుంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

 

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News