)
Extra Marital Affair legal in india: భారతదేశంలోని వివిధ ప్రాంతాలను పరిపాలించిన రాజులు ఒకరి కంటే ఎక్కువ మందిని వివాహం చేసుకున్నారని మనం చూశాము. రాజులే కాదు..మనలో చాలామంది కూడా ఇలాగే ఉండేవారు. కాలం మారుతున్న కొద్దీ.. వివాహేతర సంబంధాలు కూడా వేర్వేరు కోణాలను సంతరించుకున్నాయి. ప్రస్తుతం మనం వార్తల్లో నిత్యం అక్రమ లేదా వివాహేతర సంబంధాల గురించి వింటూనే ఉంటాం. ఒకవేళ వివాహేతర సంబంధాల నేపథ్యంలో ఇది ఎలాంటి నేరం.. దానికి తగిన శిక్ష ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
భారతదేశం అక్రమ సంబంధాలు...
ప్రస్తుత సమాజంలో వివాహేతర సంబంధాలు సర్వసాధారణంగా మారాయి. పెళ్లితో మొదలైన భార్యభర్తల అనుబంధానికి ఇవి కళంకంగా మారాయి. ఈ విధంగా పెళ్లిళ్లు విడాకులకు దారితీస్తున్నాయి. భారతదేశంలో వివాహేతర సంబంధాలను వ్యభిచారం అంటారు. సుప్రీంకోర్టు 2018లో వివాహేతర సంబంధాలను నేరం కాదని ప్రకటించింది. ఇది నేరం కానప్పటికీ.. విడాకులకు బలమైన ఆధారంగా దీనిని ఉపయోగించవచ్చు. అయితే పెళ్లి వ్యక్తి ఎవరైనా ఇష్టపూర్వకంగా లైంగిక సంబంధం పెట్టుకుంటే అది నేరంగా పరిణించలేరని నివేదికలు చెబుతున్నాయి.
అక్రమ సంబంధానికి ప్రభావాలు
ప్రేమ అయినా, పెళ్లి అయినా, ఆ సంబంధం నమ్మకం మీద నిర్మించబడింది. భార్య తన భర్త పట్ల విశ్వాసపాత్రంగా, నిజాయితీగా ఉంటే, భర్త వేరొకరితో సంబంధంలో ఉండి ఆమెను మోసం చేస్తే, అది అపనమ్మకాన్ని సృష్టిస్తుంది. భార్య తన భర్తను మోసం చేసినప్పుడు కూడా అదే జరుగుతుంది.ఈ వివాహేతర సంబంధం ఒక కుటుంబాన్ని నాశనం చేయడమే కాకుండా, చాలా సందర్భాలలో ఆ సంబంధంలోని అవతలి వ్యక్తిని కూడా మొత్తం ప్రభావితం చేస్తుంది. తమలో ఏదో తప్పు ఉందని భావించి వారు తమను తాము ప్రశ్నించుకోవడం ప్రారంభిస్తారు.
వివాదాస్పద తీర్పు!
వివాహేతర లైంగిక సంబంధం నేరం కాదనే తీర్పు భారతదేశంలో పెద్ద వివాదానికి దారితీసింది. సెప్టెంబర్ 27, 2018 వరకు భారత శిక్షాస్మృతి (IPC) వివాహేతర లైంగిక సంబంధాన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణించింది. దీని అర్థం వివాహితుడు తన భార్య కాని వివాహిత మహిళతో ఏకాభిప్రాయంతో లైంగిక సంబంధం కలిగి ఉంటే జైలు శిక్ష అనుభవించవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook