Samantha ruth prabhu temple video goes viral: సమంత ఇటీవల తరచుగా వార్తలలో ఉంటున్నారు. కొన్నిసార్లు తన సినిమాలకు చెందిన అంశాల విషయంలో వార్తలలో ఉంటే, మరికొన్నిసార్లు ఏదైన కాంట్రవర్సీ అంశాలతో రచ్చ చేస్తుంటారు. ఇక సమంత తాజాగా.. నిర్మాణ రంగంలో కూడా అడుగుపెట్టారు. నిర్మాతగా తన సొంత బ్యానర్.. ‘ట్రలాలా మూవింగ్ పిక్చర్స్’ అనే ప్రొడక్షన్ హౌస్ ని స్థాపించి, సినిమాలను నిర్మిస్తుంది. దీనిలో భాగంగా కొత్తవాళ్లతో ఆమె చేసిన ‘శుభం' షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యింది.
మరోవైపు మా ఇంటి బంగారం, నెట్ ఫ్లిక్స్ లో రక్త బ్రహ్మాండ్ అనే వెబ్ సిరిస్ లో కూడా ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇదిలా ఉండగా.. సమంతకు ప్రస్తుతం ఒక వీరాభిమాని ఏకంగా గుడి కట్టి మరీ పూజించుకుంటున్నారు. ఫ్యాన్స్ అన్నాక.. తమ అభిమాన సెలబ్రీటీలంటే ఎంతో ప్రేమ, ఆప్యాయతలు ఉంటాయి. వారి జన్మదినం, పెళ్లి రోజులు, ముఖ్య మైన రోజుల్లో ఫ్యాన్స్ లు రక్తదానం, పాలాభిషేకం, అన్నదానాలు చేయడం మనం చూస్తునే ఉంటాం .
కొంత మంది వీరాభిమానులు తమ ఫెవరెట్ సెలబ్రీటీల ఇమేజ్ ను తమ శరీరం మీద పచ్చబొట్టుగా సైతం వేసుకుంటారు.ఈ క్రమంలో ప్రస్తుతం తెలుగు రాష్ట్రంలోనే తొలిసారి ఒక వీరాభిమాని ఏకంగా సమంతకు గుడికట్టి మరీ పూజించుకుంటున్నాడు. ప్రస్తుతం సమంత గుడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది.
గుంటూరు జిల్లా తెనాలికి చెందిన సందీప్ అనే యువకుడు కారు నడిపిస్తు జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి సామ్ అంటే ఎంతో వీరాభిమానం. ఏకంగా ఆమె కోసం గుడిని కూడా కట్టాడు. తన ఇంటి ఆవరణలో ఉన్న ఖాళీ స్థలంలో సమంత గుడిని కట్టి దానిలో అచ్చం సమంతను పోలీ ఉన్న విగ్రహంను సైతం ప్రతిష్టించాడు.
రోజు సమంత విగ్రహంకు పూజలు చేసిన తర్వాత.. సందీప్ ఇతర పనులకు వెళ్తాడని అక్కడి వాళ్లు చెబుతున్నారు.ఈ క్రమంలో సమంత విగ్రహంను తన ఇంట్లో పెట్టుకున్న తర్వాత ఆర్థికంగా ఎంతో కలిసి వచ్చిందని కూడా సందీప్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సందీప్ తన ఇంట్లో పెట్టుకున్న సమంత గుడికి చెందిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది.
Read more: Samantha: రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ ఇచ్చిన సమంత.. టైమ్ చూసి భలే దెబ్బ కొట్టిందిగా..!..
దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం సందీప్ అభిమానానికి ఫిదా అవుతున్నారు. మరికొందరు మాత్రం వావ్ .. సమంతను అభిమానులు ఇంతలా ఆరాధిస్తారా.. అని కూడా విస్తుపోతున్నారు. మొత్తంగా ఈ వీడియో మాత్రం నెట్టింట హల్ చల్ చేస్తుంది.









