Farmer Plowing With Auto Viral Video Watch: భారతదేశ వ్యవసాయ ఆధారితదేశం.. అందుకే భారతదేశ వ్యాప్తంగా ప్రతి మూలన రైతులు వ్యవసాయాన్ని చేస్తూ జీవనం కొనసాగిస్తూ ఉంటారు. రైతులు పండించే పంట భారత ప్రభుత్వం వివిధ దేశాలకు ఎక్స్పోర్ట్ కూడా చేస్తోంది. అయితే, వ్యవసాయ రంగంలో కొత్త కొత్త పనిముట్లు రావడం వల్ల ఇప్పుడు మరింత సులభతరమైంది. వరి కోత యంత్రాలు, నాట్లు వేసే మిషన్లు ఇలా ఒక్కొక్క ప్రక్రియకు ఒక్కొక్క మిషన్ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. దీంతో వ్యవసాయం మరింత సులభతరంగా మారిపోయింది.
గతంలో చాలామంది వ్యవసాయదారులు పొలాలన్నీ ఎడ్ల బండ్లతో దున్నేవారు. ఆ తర్వాత ఆధునికరణలో భాగంగా ట్రాక్టర్లు వచ్చి ఎడ్లబండ్లు పోయాయి. అప్పటినుంచి ఇప్పటివరకు పొలాలను దున్నేందుకు ట్రాక్టర్ల పై ఆధారపడుతున్నారు. అయితే తాజాగా ఓ వ్యక్తి వింతగా ఆలోచించాడు తన దగ్గర ట్రాక్టర్ లేకపోవడంతో అతని తెలివిని వినియోగించి ఆటో బండిని వినియోగించి పొలాన్ని దున్నేశాడు దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ గా మారింది.
ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియో సాజిద్ హుస్సేన్ 786r అనే ఇంస్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ చేశారు.. ఈ వీడియోలో.. ఓ వ్యక్తి ఆటోతో పొలాన్ని దున్నడం మీరు గమనించవచ్చు. ఆటో వెనక భాగంలో ఒక చిన్న పొలం దున్నే పరికరాన్ని కట్టి.. ఆటో తో దున్నడం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ వీడియో చూసిన చాలామంది కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది అయితే దీనిపై హాస్యాస్పదంగా స్పందిస్తున్నారు. చూడడానికి చాలా ఫన్నీగా ఉందని.. ఇది ఒక కొత్త టెక్నాలజీ అని కామెంట్లు రాసుకు వస్తున్నారు.
ఇప్పటివరకు ఈ వీడియోను కొన్ని లక్షల మందికి పైగా వీక్షించారు.. అంతేకాకుండా ఈ వీడియోకు కామెంట్లు కూడా చేస్తున్నారు.. కొంతమంది ఇలా కామెంట్లు రాసుకు వచ్చారు.." మానవులు అతి తెలివైన వారిని ఈ వీడియో చూస్తే అర్థమయిపోతుందని" కామెంట్లు చేశారు. మరి కొంతమంది అయితే ఈ టెక్నాలజీ కనిపెట్టిన వ్యక్తి ఎంతో తెలివైన వాడని హాస్యాస్పదంగా కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది అయితే "పొలాలను దున్నటానికి ఒక ప్రత్యేకమైన అమెరికా సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన మిషన్ పనిముట్లు వచ్చాయని" ఎద్దేవ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇలా ఒక్కొక్కరు వారికి నచ్చినట్లుగా కామెంట్లు చేస్తున్నారు.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









