Father begs with daughter not to go with boy friend video: ఇటీవల కాలంలో చాలా మంది యువత ప్రేమించి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. పెద్దల కుదిర్చిన పెళ్లిళ్ల కంటే.. ప్రేమ పెళ్లిళ్లకే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఈ క్రమంలో యువతీ, యువకులు ఒకప్పటిలా కాకుండా.. ప్రతి విషయంలో కూడా ఫుల్ గా క్లారిటీగా ఉంటున్నారు.
పెళ్లికి ముందు అలవాట్లు, పెళ్లి తర్వాత కమిట్ మెంట్స్, ఫ్యామిలీ, పిల్లలు.. ఇలా అన్ని ఓపెన్ గా మాట్లాడుకుంటున్నారు. మరికొందరు ఒక అడుగు ముందుకేసి లివింగ్ రిలేషన్ లో కూడా ఉంటున్నారు. ఇద్దరికి సెట్ అయితే.. కంటీన్యూ చేసి పెళ్లి వరకు వెళ్తున్నారు. ఒక వేళ ఏదైన జరిగితే మాత్రం.. బ్రేకప్ లు చెప్పేసుకుంటున్నారు.
ఈ క్రమంలో కొంత మంది పెద్దలకు తెలియకుండా.. ప్రేమించి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఒకవేళ పెద్దలు వాళ్ల ప్రేమను అంగీకరించకుంటే.. వాళ్లను ఎదిరించి మరీ ఇంట్లోంచి వెళ్లిపోతున్నారు. ఇంట్లో వాళ్లకు ఇష్టంలేకున్న కూడా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కొందరు కూతుళ్లు పారిపోయి పెళ్లిళ్లు చేసుకుంటే.. కొన్నిరోజులు కోపంతో ఉండి.. మరల కన్న పేగు కదా..అని అవన్ని మర్చిపోతున్నారు. కానీ మరికొందరు మాత్రం దారుణాలకు పాల్పడుతున్నారు.
Telugu Scribe Fact Check
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో ఒక తమిళ షార్ట్ ఫిలిం లోనిది
తమిళనాడులో ప్రేమించిన యువకుడితో వెళ్లోద్దని కూతురి కాళ్లపై పడి తండ్రి వేడుకుంటున్నట్టు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో
ఈ వీడియో సాయి విజయ్ అనే డైరెక్టర్ తీసిన తమిళ షార్ట్… pic.twitter.com/qTEX5W1grz
— Telugu Scribe (@TeluguScribe) March 22, 2025
ఈ నేపథ్యలో ప్రస్తుతం ఒక వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది. ఒక యువతి తన ప్రియుడితో కలిసి రాత్రిపూట.. ఇంటి నుంచి వెళ్లిపోతుంటే... ఆ తండ్రి ఇది చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ కూతుర్ని పారిపొవద్దని ప్రాధేయపడ్డాడు. తన గుండెల మీద తన్నేసి వెళ్లవద్దని ఆమెను రిక్వెస్ట్ చేశాడు. చివరకు కాళ్ల మీద కూడా పడ్డారు. అయితే.. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఎమోషనల్ అవుతున్నారు.
ఈ సినిమా.. తమిళంలో తీస్తున్న ఒక షార్ట్ ఫిలింలోనిదని.. అందులోని ఒక సీన్ లో ప్రేమించిన యువకుడితో, యువతి పారిపోతుంటే.. ఆమె తండ్రి కాళ్ల మీద పడ్డాడు. ఈ వీడియో సాయి విజయ్ అనే డైరెక్టర్ తీసిన తమిళ షార్ట్ ఫిలిం లోని ఒక సన్నివేశం. చాలా మంది నెటిజన్లు తొలుత ఇది నిజంగానే జరిగిందని కూడా ఎమోషనల్ అయ్యారు. చివరకు ఇది షార్ట్ ఫిలింలోనిదని తెలిసి ఓర్ని.. అంటూషాక్ అవుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter