Father risks his life to save daughter who fell railway platform video: సాధారణంగా చాలా మంది రైల్వేస్టేషన్ కు వెళ్లి ఎంతో గాబరాగా రన్నింగ్ ట్రైన్ ఎక్కడానికి ప్రయత్నిస్తుంటారు. కొంతమంది రైలు రన్నింగ్ లో ఉండగానే దిగేందుకు ట్రై చేస్తుంటారు. దీని వల్ల పెద్ద ప్రమాదాలు చోటు చేసుకున్న ఘటనలు చాలా ఉన్నాయి. అంతే కాకుండా.. కదులుతున్న ట్రైన్ లో ఎక్కడానికి ప్రయత్నించవద్దని రైల్వే అధికారులు ఇప్పటికే చెబుతున్నారు. అయిన కూడా చాలా మంది ప్రయాణికులు పూర్తిగా నెగ్లీజెన్సీతో ఉంటారు.
Dad shields his daughter with his body after she stepped into a train’s pathpic.twitter.com/Blqs1UISc8
— Interesting things (@awkwardgoogle) June 16, 2025
అంతే కాకుండా.. ట్రైన్ లు పట్టాల మీద ఉన్న కూడా ఒక ప్లాట్ ఫామ్ మీద మరోప్లాట్ ఫామ్ మీదకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఒక యువతి ఒక ప్లాట్ ఫామ్ మీద నుంచి మరోక చోటకు వెళ్లేందుకు ప్రయత్నించింది. ఇంతలో కళ్ల ముందు వేగంగా ట్రైన్ రావడంతో ఆమె షాక్ తో పట్టాలు, ప్లాట్ ఫామ్ మధ్యలో నిలబడిపోయింది.
ఇంతలో కూతుర్ని గమనించిన తండ్రి.. వెంటనే పట్టాల మీదకు దూకి ప్లాట్ ఫామ్ వైపుకు వచ్చేసి కూతుర్ని గట్టిగా హత్తుకున్నాడు. ఇంతలో ట్రైన్ కూడా వేగంగా వాళ్ల మీద నుంచి వెళ్లిపోయింది. కానీ వారి లక్ బాగుండీ.. వాళ్లకు ఏమి కాలేదు.
ఈ ఘటనలో తన కూతురి కోసం తండ్రి చూపిన ప్రేమ, సాహాసం చూసి అక్కడున్న వారు ఎమోషనల్ అవుతున్నారు. ఈ ఘటనను వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. అసలు... రన్నింగ్ ట్రైన్ వస్తున్న సమయంలో ఈ స్టంట్ లు అవసరమా.. అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook