Black King Cobra Vs King Cobra Video: కింగ్ కోబ్రా జాతుల్లో అత్యంత విషపూరితమైన పాము ఏంటో కాదు బ్లాక్ కింగ్ కోబ్రా.. ఈ పాము చాలా విషపూరితమైంది గా చెప్పుకుంటారు. ఇది చూడడానికి నలుపు రంగులో కనిపించినప్పటికీ దీని కింది భాగంలో కాస్త తెలుపు రంగును కలిగి ఉంటుంది. భారతీయులు దీనిని నల్లత్రాచు లేదా రాచనాగు అని కూడా పిలుస్తారు. దీనికున్న నలుపు రంగు దాని గంభీరమైన రూపం ప్రత్యేకమైన దృష్టిని ఆకర్షిస్తుంది. సాధారణంగా ఈ నలుపు రంగు నాగుపాములు దాదాపు 10 నుంచి 15 అడుగుల పొడవు కలిగి ఉంటాయి కొన్ని పాములైతే ఏకంగా 18 అడుగుల పొడవును కూడా కలిగి ఉంటాయని కొంతమంది నిపుణులు తెలుపుతున్నారు. ఇది నలుపు రంగులో ఉన్నప్పటికీ.. వీటి శరీరంపై కటిక నలుపు రంగుతో కూడిన చారలు ఉంటాయి. అంతేకాకుండా ఇవి అన్ని పాముల కంటే చాలా ఆగ్రహాన్ని కలిగి ఉంటాయని సమాచారం. అలాగే ఈ కింగ్ కోబ్రా పాములు ప్రత్యేకమైన కళ్ళను కూడా కలిగి ఉంటాయి.
సాధారణంగా నలుపు రంగు కింగ్ కోబ్రాలు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఎక్కువగా దక్షిణ, ఆగ్నేయాసియాలోని కొన్ని ప్రాంతాల్లో.. భారత్, బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్ లలో ఉండే చిత్తడి నేలల్లో నివసిస్తూ ఉంటాయి. ఇవి జన్మించే క్రమంలో సాధారణ రంగు ఉన్నప్పటికీ జన్యుపరమైన కారణాలవల్ల నలుపు రంగులోకి మారుతూ ఉంటాయి. ఈ పాములు ఎక్కువగా దట్టమైన అడవులతో పాటు వెదురు పొదల్లో వ్యవసాయ సమీప భూముల్లో ఎక్కువగా ఉండేందుకు ఇష్టపడతాయి. అంతేకాకుండా నీటి వనరులు దగ్గరగా ఉండే ప్రదేశాల్లో జీవిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఈ ప్రదేశాల్లో జీవించే క్రిమి కీటకాలను అవి ఆహారంగా చేసుకుంటాయి.
సాధారణంగా ఇలాంటి నలుపు రంగుతో కూడిన కింగ్ కోబ్రాను అరుదుగా జనావాసాల్లోకి సంచారం చేస్తూ ఉంటాయి. ఇలాంటి సందర్భంలోనే కొంతమంది వాటిని కెమెరాలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వీడియోలు అప్పుడప్పుడు విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా 2 బ్లాక్ కింగ్ కోబ్రాలకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది. ఈ వీడియోలో ఒక కింగ్ కోబ్రా మరో పాము పై దాడి చేయడం చూడవచ్చు. ఇలా రెండు పాములు ఒకదానికొకటి పరస్పరం దాడి చేసుకోవడం.. చివరగా ఒక పాము ఓడిపోయి వెళ్లిపోవడం మీరు ఈ వీడియోలో చూడవచ్చు. దీనికి సంబంధించిన వీడియో @ఫార్మ్ట్రాక్లవర్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను కొన్ని లక్షల మంది సోషల్ మీడియా వినియోగదారులకు పైగా వీక్షించారు.. అంతేకాకుండా 2000 మందికి పైగా నెటిజన్స్ లైక్ చేసినట్టు తెలుస్తోంది. కొంతమంది ఈ వీడియోను చూసి కామెంట్లు కూడా చేస్తున్నారు.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









