)
Lion Vs Black Mamba Snake Viral Video Watch: ఆఫ్రికన్ దేశానికి సంబంధించిన పాములు ప్రపంచంలోనే ప్రమాదకరమైన పాములుగా పేరుగాంచాయి.. అందుకే వాటికి సంబంధించిన విషయంతో వివిధ రకాల పరిశోధనలు చేస్తూ ఉంటారు. అయితే సాధారణంగా ఆఫ్రికన్ పాములు అన్ని పాములు కంటే కొంత భిన్నంగా ఉంటాయి. రూపు, పొడవులో చూడడానికి అన్ని పాముల కంటే కాస్త పెద్దవిగా ఉంటాయి.. ఎక్కువగా ఆఫ్రికన్ అడవుల్లో నాగుపాములతో పాటు బ్లాక్ మాంబ జాతులకు సంబంధించిన పాములు కూడా కనిపిస్తూ ఉంటాయి. చాలామంది అడవుల్లో తిరిగే క్రమంలో వాటిని స్మార్ట్ ఫోన్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. తాజాగా ఇలాంటి వీడియోనే ఇప్పుడు వైరల్ గా మారింది.
వీడియో వివరాల్లోకి వెళితే.. ఆఫ్రికన్ అడవుల్లో పాములకు రాజుగా పిలువబడే బ్లాక్ మాంబ అత్యంత ప్రమాదకరమైంది. అయితే ఇది ఏకంగా అడవికి రాణి అయినా సింహంతోనే పెట్టుకుంది. దారిగుంట నడిచి వస్తున్న సింహం వీడియోలో మధ్యలోనే ఆగిపోతుంది. అయితే ఈ సింహం ముందుగానే బ్లాక్ మాంబ పామును చూడడంతో అక్కడే ఆగిపోతుంది. అయితే సింహం దీనిని చూసి తన కాలుతో దాడి చేయాలనుకుంటుంది. ఇదే సమయంలో తన కాలితో దాడి కూడా చేస్తుంది.. పాము దీనిని తట్టుకోలేక ఏకంగా సింహంపై దాడికి దిగుతుంది. ఇలా రెండిటి మధ్య బీకర యుద్ధమే జరుగుతుంది..
అయితే ఇప్పటికే ఆ పాము చనిపోయిన పక్షితో ఉండడం వల్ల సింహం పై గెలవలేక పోతుంది. ఆ బ్లాక్ మాంబ కొద్దిసేపు సింహంతో పోరాడి పక్కకు వెళ్ళిపోతుంది. అయితే ఇలాంటి ప్రమాదకరమైన పాములు సింహం పై దాడి చేస్తే తప్పకుండా అవి మరణించే అవకాశాలు కూడా ఉన్నాయి.. అందుకే కొన్ని ప్రమాదకరమైన జంతువులు కూడా బ్లాక్ మాంబ జోలికి వెళ్లేందుకు అంతగా ఇష్టపడవు. అయితే తాజాగా ఈ వీడియోకు సంబంధించిన దృశ్యాలు ఇంటర్నెట్లో ప్రత్యక్షమయ్యాయి. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.
ఈ వైరల్ అవుతున్న వీడియోను 'PaintedDog.tv' అనే ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను కొన్ని లక్షల మందికి పైగా వీక్షించగా 33 వేల మందికి పైగా సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్లు చేశారు అంతేకాకుండా కొన్నివేల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఏది ఏమైనా ఇలాంటి వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయని కొంతమంది నెటిజన్స్ కామెంట్లలో చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook