Rare Face Fish Video Viral: మనిషిలాంటి ముఖం కలిగిన చేపను చూశారా? చూడని వారికోసం ఈ వీడియో..

Rare Face Fish Video Watch Here: ఎప్పుడైనా మనిషి ముఖం ఆకారం కలిగిన చేపలను చూసి ఉన్నారా? ప్రస్తుతం ఇలాంటి ఆకారం కలిగిన చేపలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఈ వీడియోను చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 6, 2025, 07:45 AM IST
Rare Face Fish Video Viral: మనిషిలాంటి ముఖం కలిగిన చేపను చూశారా? చూడని వారికోసం ఈ వీడియో..

Rare Face Fish Video Watch Now: భూమిపై ఎన్నో రకాల వింత జాతులకు సంబంధించిన జంతువులు ఉన్నాయి. అంతేకాకుండా వింత సరిస్కృపాలు, వింత చేపలు కూడా ఉంటాయి. ఇవన్నీ కేవలం కొన్ని సందర్భాల్లో మాత్రమే బయటికి వచ్చి కనిపిస్తూ ఉంటాయి. కొన్ని జంతువులు మనుషులను కూడా పోలి ఉంటాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు సోషల్ మీడియాలో మనుషులను పోలివున్న చేపకు సంబంధించిన వీడియో ప్రత్యక్షమైంది. సాధారణంగా మనం ఎన్నో రకాల చేపలను చూస్తూ ఉంటాం.. ఈ చేపల్లో కొన్ని రంగురంగులు కలిగి ఉంటే.. మరికొన్ని ప్రత్యేకమైన ఆకారాలను కలిగి ఉంటాయి. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన చేప వీటన్నిటికంటే చాలా భిన్నంగా ఉంది. 

Add Zee News as a Preferred Source

ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఫిష్‌కు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో పెద్ద ముఖంతో చిన్న ఆకారాన్ని కలిగి ఉన్న చేపను చూడొచ్చు. అయితే వింత ఏమిటంటే ఈ ట్రిగ్గర్ ఫిష్ ముఖం అచ్చం చూడడానికి మనుషుల ఫేస్ లాగానే కనిపిస్తుంది. అంతేకాకుండా పెద్దని పెదాలతో పాటు దంతాలను పోలి ఉన్న మూఖ నిర్మాణం ఈ ఫిష్ కలిగి ఉండడం చూడవచ్చు. అంతేకాకుండా దీని నోరు దంతాలు చూడడానికి మనుషులకు ఉండేలాగే కనిపిస్తాయి. అలాగే ఇవి బలమైన దవడాలతో పాటు పెద్ద పెదాలు, తలపై భాగంలో చిన్న కళ్లను కలిగి ఉంటాయి. చేప తలనంత చూస్తే అచ్చం మనిషి తల ఆకారంలోనే కనిపిస్తూ ఉంటుంది.

సాధారణంగా ఇలాంటి చేపలు చాలా అరుదుగా సముద్రంలో కనిపిస్తూ ఉంటాయట. ఇవి ఎక్కువగా కొన్ని ప్రాంతాల్లో ఉండే ఉష్ణ మండల జలాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయట. అంతేకాకుండా ఈ ట్రిగ్గర్ ఫిష్లు దాదాపు 40 నుంచి 50 జాతులు ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇవి ఎక్కువగా చిన్నచిన్న చేపలతోపాటు నాచు, నత్తలు వంటి ఆహారం తీసుకుంటాయట. అంతేకాకుండా ఇవి ఉష్ణ మండల సముద్రాల్లోని ఆవాసాలను ఏర్పరచుకుంటాయి. గూడును కాపాడుకోవడానికి ఇతర చేపల పై దాడులు కూడా చేస్తూ కూడా ఉంటాయి. అంతేకాకుండా ఈ చేపలు ఇతర రంగులను కూడా కలిగి ఉంటాయి.

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News