)
Four headed Cobra Snake ai generated Trending Video: పాముల వీడియోలకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉందని చెప్పుకొవచ్చు. ముఖ్యంగా అడవులు, చెరువులు ఉన్న చోట పాములు ఎక్కువగా సంచారం చేస్తాయి. అంతే కాకుండా.. కోబ్రాలు ఎక్కువగా ఎలుకలు, కప్పలు ఉన్న చోట ఎక్కువగా ఉంటాయి. ఇటీవల కాలంలో నిత్యం అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి.
వీటిలో ఏవి నిజమైనవో లేదా ఏవీ ఫెక్ వీడియోలో మాత్రం అర్థం కావడంలేదు. దీంతో చాలా మంది ఈ వీడియోలను చూసి షాక్ అవుతున్నారు. ఇటీవల సెలబ్రీటీలకు సంబంధించి డీఫ్ ఫెక్ వీడియోలు వైరల్ అయ్యాయి. టెక్నాలజీని వాడుకుని కొంత మందిలేని పోనీ వీడియోలను క్రియేట్ చేసి మరీ వైరల్ చేస్తున్నారు. ఇది నిజం అనుకుని జనాలు పప్పులో కాలేస్తున్నారు.
మొత్తంగా నెట్టింట ఇప్పుడైతే ఒక నాలుగు తలల పాము వీడియో వైరల్గా మారింది. దీనిలో పాము పడగ విప్పీ మరీ రచ్చ చేస్తుంది. పురాణాల్లో పదకొండుతలల పాములు,ఐదు తలల పాములు ఉండేవని మనం విన్నానం. కానీ కొంత మందిని వీటిని నమ్ముతుంటే, మరికొంత మంది మాత్రంఇదేంలేదని కొట్టిపారేస్తారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒక నాలుగు తలల పాము వీడియో నెట్టింట వైరల్గా మారింది.
దీనిలో నాలుగు తలల పాము..పగడ విప్పీ బుసలు కొడుతూ అక్కడున్న వారిని భయపెడుతుంది. రోడ్డుకు అడ్డంగా నిలబడి మరీ బుసలు కొడూతూ అందర్ని బిత్తరపోయేలా చేసింది. అక్కడున్న వారు చాలా సేపు ఆ పామును చూస్తు ఉండిపోయారు.
అయితే.. ఇక్కడ కూడా ట్విస్ట్ ఏంటంటే.. అది ఏఐ జనరేటేడ్ పాము.. నిజమైంది కాదని విషయం ఆలస్యంగా బైటపడింది. కానీ ఇది తెలియని చాలా మంది ఈ వీడియో చూడగనే అది నిజమైందని అనుకుని ఈ వీడియోను తెగవైరల్ చేశారు. కానీ ఆలస్యంగా నిజం తెలిసి.. ఓర్నీ.. భలే బురిడి కొట్టించారని రియలైజ్ అవుతున్నారు.