)
Black Cobra Video Watch Now: ఇటీవలే సామాజిక మాధ్యమాల్లో పాములకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతుంది. ఈ వీడియోలను చూసి సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. తాజాగా ఓ బ్లాక్ కింగ్ కోబ్రా, కోతికి సంబంధించిన వీడియో చర్చనీయాంశంగా మారింది. కోతి పాము కు మధ్య ఉన్న స్నేహం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా నల్ల నాగుపాములు అత్యంత ప్రమాదకరమైనమని మనందరికీ తెలుసు. ఇవి వాటికి ఆకలేసినప్పుడు ఎలాంటి ప్రాణులైన ఎంతో సులభంగా దాడి చేసి చంపుకొని తినే సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి. ఇలాంటి పాములు జంతువులతో స్నేహం చేయడం చాలా అరుదు. కానీ ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలు కోతి, నల్ల నాగు పాము మధ్య మంచి స్నేహం ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది..
వీడియో వివరాల్లోకి వెళ్తే.. వీడియోలు ఒక కోతి నేలపై అతి ప్రశాంతంగా కూర్చుని ఉంది.. దాని పక్కనే ఒక అత్యంత ప్రమాదకరమైన నల్ల నాగుపాము కూడా ఉండడం మీరు చూడొచ్చు. అయితే మొదటగా వీటి రెండిటిని చూసిన తర్వాత.. ఏదో జరగబోతుందని అనుకుంటూ ఉంటాం.. కానీ ఆ తర్వాత జరిగిన ఘటన అందరిని విస్మయానికి గురిచేస్తూ వస్తోంది. రాజ్ పాము నెమ్మదిగా కదులుతున్న కోతి శరీరం పైకి పాకి.. దాని మెడ చుట్టూ చుట్టుకుంది. ఇదంతా జరుగుతున్న కోతి ఏమాత్రం భయపడకుండా అలాగే ఉండిపోయింది. దీన్నిబట్టి చూస్తే వీటి రెండిటి మధ్య ఉన్న స్నేహం అంతో ఇంతో కాదనిపిస్తుంది..
సాధారణంగా నల్లత్రాచు పాములు, కింగ్ కోబ్రాలు అత్యంత విషపూరితమైనవిగా చెప్పుకుంటారు.. వాటిని చూస్తే ఏ జంతువు అయినా.. మనిషైనా తప్పకుండా భయపడి పారిపోతూ ఉంటారు.. కానీ ఈ వీడియోలో మాత్రం పాము కోతి పై పాకుతున్న, అటు ఇటు కదులుతున్న కోతి ప్రశాంతంగా కదలకుండా అలాగే ఉండిపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అంతేకాకుండా కోతికి ఆ నల్ల త్రాచు పాము వల్ల ఏమాత్రం ప్రమాదం లేదని ముందే తెలిసి ఉండొచ్చని, లేదంటే ఇది పెంచుకున్న పామై ఉండొచ్చని కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు..
ఈ వీడియోలో కోతితో పాటు పాము రెండు ఒకదానికొకటి ఎలాంటి హాని చేసుకోకుండా చాలా ప్రశాంతంగా ఉన్నాయి.. చివరివరకు అవి రెండు ఎంతో స్నేహపూర్వకంగా ఉండడం చూసి కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యానికి గురయ్యారు. దీన్నిబట్టి చూస్తే ప్రకృతిలో జంతువుల మధ్య ఉండే సంబంధాల విలువ అర్థమవుతోంది. ఈ వీడియోని ఇప్పటివరకు కొన్ని వేల మందికి పైగా వీక్షించారు.. అయితే చాలామంది ఈ వీడియోని చూసి వారి అభిప్రాయాలను కామెంట్లను వ్యక్తం చేస్తున్నారు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి