Ghibli Art Creation: ఓపెన్ ఏఐ నుంచి జీపీటీ 4o పేరుతో వచ్చిన సరికొత్త ఏఐ ఇమేజ్ క్రియేటర్ వెర్షన్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ టూల్ చాలా సులభంగా ఘిభ్లి చిత్రాలు సృష్టిస్తుండటంతో అందరూ ఇదే పనిలో పడ్డారు. తమ ఫోటోల్ని ఘిబ్లి చిత్రాల్లో చూసుకుని మురిసిపోతున్నారు. అందరికీ షేర్ చేస్తున్నారు.
ఘిబ్లి ఫోటోలు మామూలు ఫోటోల్లా కాకుండా యానిమేషన్ గేమింగ్ చిత్రాల్లో ఉండటంతో అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఇవే చిత్రాల్ని క్రియేట్ చేసుకుని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ ఘిబ్లి చిత్రాలు అత్యంత సులభంగా ఎలా క్రియేట్ చేసుకోవచ్చో తెలుసుకుందాం. ప్రస్తుతానికి వీటిని ఉచితంగా పొందవచ్చు గానీ పరిమితి ఉంటుంది. అదే సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే ఎన్నైనా తీసుకోవచ్చు.
ఘిబ్లి చిత్రాలు క్రియేట్ చేసుకోవడం ఎలా
ముందుగా ప్రాంప్ట బార్‌లో కన్పించే మూడు చుక్కలపై క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు ఇమేజ్, కాన్వాస్ అనే రెండు ఆప్షన్లు కన్పిస్తాయి. మీ చిత్రంపై క్లిక్ చేసి ప్రాంప్ట్ ఇవ్వాలి. అంటే ఎలాంటి చిత్రం కావాలో మెన్షన్ చేయాలి. అంతే మీరిచ్చిన సూచన ఆధారంగా మీ ఘిబ్లి చిత్రం క్రియేట్ అవుతుంది. ఈ ఫోటోను మీరు సేవ్ చేసుకోవచ్చు.
ఘిబ్లి చిత్రాల కోసం జీపీటీ 40 లేదా చాట్ జీపీటీ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. క్రైయాన్ అనే ఏఐ టూల్ ద్వారా కూడా ఘిబ్లి చిత్రాలు క్రియేట్ చేయవచ్చు.
Also read: Exam Results Date: ఏపీ తెలంగాణ ఇంటర్, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పదో తరగతి పరీక్ష ఫలితాలు ఎప్పుడో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









