Ghibli Safety: ఘిబ్లి చిత్రాల కోసం ఫోటోలు అప్‌లోడ్ చేస్తున్నారా, ఇది సురక్షితమేనా లేదా

Ghibli Safety: ప్రస్తుతం ఏ సోషల్ మీడియా చూసినా ఘిబ్లి స్టైల్ ఫోటోలతో నిండిపోయి కన్పిస్తోంది. ఘిబ్లిపై మోజుతో అందరూ తమ పోటోల్ని అప్‌లోడ్ చేసుకుంటున్నారు. ఇదే ఇప్పుడు ఆందోళన కల్గిస్తోంది. ఎంతవరకూ సేఫ్ అనే ప్రశ్నలు వస్తున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 2, 2025, 10:17 PM IST
Ghibli Safety: ఘిబ్లి చిత్రాల కోసం ఫోటోలు అప్‌లోడ్ చేస్తున్నారా, ఇది సురక్షితమేనా లేదా

Ghibli Safety: యానిమేషన్ గేమింగ్ చిత్రాలను పోలి ఉండటంతో అందరూ తమ తమ ఫోటోల్ని అదే తరహాలో చూసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే ఓపెన్ ఏఐ సృష్టించిన ఘిబ్లి స్టైల్ ఆర్ట్ ఇమేజెస్‌పై మోజు పెరుగుతోంది. వ్యక్తిగత ఫోటోలని కూడా చూడకుండా ఘిబ్లి స్టైల్ చిత్రాల కోసం  చాట్ జీపీటీలో అప్‌లోడ్ చేసుకుంటున్నారు. అయితే ఇది ఎంతవరకు సురక్షితమనే ప్రశ్న విన్పిస్తోంది. ఎందుకంటే అసలు విషయం తెలిస్తే మీరు పొరపాటున కూడా ఘిబ్లి కోసం వెంపర్లాడరు

Add Zee News as a Preferred Source

సాధారణంగా ఘిబ్లి స్టైల్ ఫోటోలు కోసం చాట్ జీపీటీలో మన వ్యక్దిగత ఫోటోలు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. వీటిని యానిమేటెడ్ ఫోటోలుగా మార్చి అందిస్తుంది. అయితే మనం అప్‌లోడ్ చేసిన వ్యక్తిగత ఫోటో సంగతేంటని ప్రశ్నించుకుంటే ఆ ఫోటో చాట్ జీపీటీలో స్టోర్ అయి ఉంటుంది. ఎప్పుడైనా అవసరం అయినప్పుడు వినియోగించుకుంటుంది. ఉదాహరణకు మీరు చాట్ జీపీటీ ఓపెన చేసి మంచి ఇండియన్ ఫ్యామిలీ ఫోటో క్రియేట్ చేయమని అడిగితే అప్పటికే మనం అప్‌లోడ్ చేసిన ఫోటోల్లో ముఖాల్ని అటూ ఇటూ మార్చి ఇస్తుంది. అంటే మీరు లేదా మీ కుటుంబసభ్యుల ఫోటోలు కొత్త ఫేస్ కట్స్‌తో ఇతరులకు వెళ్లవచ్చు లేదా ఇతరులవి మీకు రావచ్చు. దీనివల్ల ప్రైవసీ పోతుంది. 

ఘిబ్లి స్టైల్ ఫోటోల వల్ల ఇబ్బందులు

ఘిబ్లి స్టైల్ ఫోటోల కోసం మీరు చాట్ జీపీటీలో అప్‌లోడ్ చేసే ఫోటోలకు ప్రైవసీ ఉండదు. మన అనుమతి లేకుండానే వివిధ రకాల పనుల కోసం వాడుతుంటుంది. అంతేకాదు..మీ గుర్తింపుని చాట్ జీపీటీ తస్కరించే ప్రమాదం లేకపోలేదు. తప్పుడు పనులకు వాడవచ్చు. ఎందుకంటే చాట్ జీపీటీకు మనం అందించే డేటాకు ఎలాంటి భద్రత ఉండదు. హ్యాకింగ్‌కు గురి కావచ్చు. అందుకే ట్రెండింగ్ మోజును పక్కనపెట్టి ఘిబ్లి ఫోటోల కోసం ప్రయత్నించకపోవడమే మంచిది. లేదంటే మీ వ్యక్తిగత ఫోటోలు ప్రమాదంలో పడినట్టే.

Also read: Ghibli Art Creation: మీరు కూడా ఘిబ్లి స్టైల్ చిత్రాల కోసం చూస్తున్నారా, ఇలా క్రియేట్ చేసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News