Ghosts bathing in maha kumbh video: ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళ వేడుకగా ముగిసింది. జన్వరి 13న ప్రారంభమైన కుంభమేళ, ఫిబ్రవరి 26 మహాశివరాత్రి షాహిస్నానంతో ముగిసింది. కుంభమేళ ముగిసిన కూడా భక్తులు మాత్రం ఇంకా కుంభమేళలకు వస్తునే ఉన్నారు. అక్కడ ప్రతిరోజు భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం కుంభమేళలో ఇప్పటి వరకు 70 కోట్ల వరకు పుణ్యస్నానాలు ఆచరించిట్లు యూపీ సర్కారు వెల్లడించింది. దేశంలోనే ప్రయాగ్ రాజ్ కుంభమేళ ఒక హిస్టరీ క్రియేట్ చేసిందని కూడా సమాచారం.
144 ఏళ్ల తర్వాత ఏర్పడిన మహా కుంభమేళ కావడంతో మనదేశంనుంచి మాత్రమే కాకుండా.. ప్రపంచనలుమూలల నుంచి కూడా పవిత్ర స్నానాలు ఆచరించేందుకు భక్తులు పొటెత్తారు.ఈ క్రమంలో ప్రస్తుతం కుంభమేళలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించిన అనేక వీడియోలు వైరల్ అయ్యాయి. సెలబ్రీటీలు, రాజకీయనేతలు అందరు కూడా పవిత్ర స్నానాలు ఆచరించారు.
అయితే.. ప్రస్తుతం ఒక వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. త్రివేణి సంగమంలో భూతాలు, దెయ్యాలు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నాయని చెబుతూ ఒక వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది. ఈ వీడియోలోని సీసీటీవీలో కొంత మంది గుంపులుగా చెందురం రంగు బట్టలు ధరించి పుణ్యస్నానాలు ఆచరించినట్లు కన్పిస్తుంది. కానీ మరొవైపు రియల్ గా చూస్తే అక్కడ ఎవరు కన్పించడంలేదు.
అయితే.. దీనిపై అక్కడి అఘోరీలో మాట్లాడితే.. శివుడు స్మశానంలో ఉంటారు. భూతాలకు ఆయన అధిపతి.పంచభూతాలు, భూమిమీద ఉన్న ప్రతి ప్రాణి ఆయన ఆధినంలోనే ఉంటుంది.
Read more: Viral Video: ఏంట్రా ఇది.. కొండ చిలువని పట్టుకుని స్కిప్పింగ్ ఆడుతున్న యువకులు.. వీడియో వైరల్...
భూతాలు, ప్రేతాలు కూడా కుంభమేళకు వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తాయని అక్కడి వాళ్లు చెప్పినట్లు సమాచారం. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. మరొవైపు ఈ వీడియో కుంభమేళది కాదని.. అసలు విషయంను మరికొందరు చెబుతున్నారు.
ఈ వీడియో వాస్తవానికి బ్రెజిల్ లోని పరానా నుంచి వచ్చిందని.. అక్కడి బీచ్ లో కొంత మంది వ్యక్తులు స్నానాలు చేస్తున్నారని తెలింది. అయితే.. కొంత మంది కావాలని కుంభమేళలను లింక్ చేసి ఈ వీడియోను వైరల్ చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది.









