Giant Python Snake Viral Video: నిప్పులపై 12 అడుగుల కొండచిలువను కాల్చుకొని తిన్న యువకుడు.. వీడియో ఇదే చూడండి..

Giant Python Snake Viral Video Watch: తాజాగా సోషల్ మీడియాలో ఓ యువకుడు భారీ కొండచిలువను నిప్పులపై కాల్చుకొని తినడానికి సంబంధించిన  విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిని చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు..

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 16, 2025, 08:39 AM IST
Giant Python Snake Viral Video: నిప్పులపై 12 అడుగుల కొండచిలువను కాల్చుకొని తిన్న యువకుడు.. వీడియో ఇదే చూడండి..

Giant Python Snake Viral Video Watch​ Here: ప్రపంచవ్యాప్తంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఆహారానికి ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు.. కొన్ని ప్రాంతాల వారు ఇతరులకు అసహ్యంగా అనిపించిన ఆహార పదార్థాలను కూడా తింటూ ఉంటారు. కొన్ని ప్రదేశాలను అందరూ ఎంతో ఇష్టంగా బల్లులను కప్పలను తింటే.. మరికొన్ని ప్రదేశాల్లో పెద్ద పెద్ద పాములను, మొసళ్లను తినడం వంటివి కామన్.. కొంతమంది ఇలా తింటూ అనేక రకాల వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. వీటికి సంబంధించిన వీడియోలే ఎక్కువగా జనాలు చూసేందుకు ఆసక్తి చూపుతారు. అయితే ఇటీవలే సోషల్ మీడియా వినియోగదారుడు ఎంతో అసహ్యకరమైన ఆహారాలను తింటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. 

Add Zee News as a Preferred Source

తాజాగా ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇంస్టాగ్రామ్‌లో 12 అడుగుల కొండచిలువను బాబిక్యూ స్టౌవ్‌పై వేయించడం మీరు గమనించవచ్చు. ఇప్పుడు దీనికి సంబంధించిన దృశ్యాలను చూసి సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు. వీడియోకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బాబిక్యూ చేసుకునే ఓ మిషన్లో ఎర్రటి నిప్పుల నుంచి పొగ పైనికి రావడం మీరు గమనించవచ్చు. అలాగే ఓ యువకుడు ఆ మంటపై ఏదో కాల్చడం కూడా మీరు చూడవచ్చు. నిజానికి అదేంటో కాదు.. 12 అడుగుల భారీ కొండచిలువ... కొండచిలువను నీటిగా క్లీన్ చేసి దానికి ఉప్పు కారం పసుపు అన్ని పట్టించాడు. ఆ తర్వాత అతడు సన్నని మంటపై డీప్ ఫ్రై చేయడం మీరు గమనించవచ్చు. అంతేకాకుండా ఆ పాము కూడా సన్నని సెగపై మంచి కలర్ లో కనిపించడం మీరు చూడవచ్చు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. 

 
 
 
 
 

థాయిలాండ్ వంటి దేశాల్లో ఎక్కువగా పాములతో పాటు మోసలను తింటూ ఉంటారు. అంతేకాకుండా వారు తరచుగా పాములను డీప్ ఫ్రై చేస్తున్న వీడియోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఎక్కువగా ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. అయితే ఈ వైరల్ అవుతున్న వీడియో కూడా థాయిలాండ్ కు సంబంధించిందేనని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియోను ఇప్పటివరకు 24 మిలియన్లకు పైగా సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కొంతమంది నెటిజన్స్ వారి అభిప్రాయాలను కూడా కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అయితే ఆశ్చర్యపోతున్నారు.

చాలామంది కొండచిలువను తినడం సురక్షితమేనా ప్రశ్నలు సంధిస్తున్నారు.. సైంటిఫిక్ రిపోర్ట్స్ అనే జర్నల్‌ తెలిపిన వివరాల ప్రకారం ఈ కొండచిలువలో ప్రోటీన్ అధిక మొత్తంలో ఉంటుంది. కొండచిలు బాబు కండరాల భాగంలో నిలువ ఉండే కొవ్వులు శరీరానికి బోలెడు లాభాలు అందిస్తాయట. అంతేకాకుండా ఇందులో భారీ మొత్తంలో పోషకాలు ఉంటాయి కాబట్టి సరైన పద్ధతిలో తినడం వల్ల శరీరానికి ఎన్నో రకాల లాభాలు కలుగుతాయని ఇటీవలే అధ్యయనాల్లో తెలిపారు. అంతేకాకుండా ఎక్కువ ఎండ ప్రాంతాల్లో తిరిగేవారు వీటిని తినడం వల్ల విశేషమైన ప్రయోజనాలు పొందగలుగుతారట..

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News