)
Giant Anaconda Viral Video Here: అమెజాన్ నదుల్లో అత్యంత ప్రమాదకరమైన ఎన్నో రకాల ప్రమాదకరమైన పాములుంటాయి. ముఖ్యంగా నది పరివాహక ప్రాంతంలో మొసళ్లతోపాటు ఎక్కువగా కొండచిలువ, అనకొండ వంటి పాములు కూడా తిరుగుతూ ఉంటాయి. కొంతమంది వీటిని చూసేందుకు పడవలపై అక్కడికి వెళుతూ ఉంటారు. అయితే, ఇలా వెళ్తున్న వారికి ఓ అరుదైన వారి అనకొండ పాము కనిపించింది. ఇప్పుడు దీనికి సంబంధించిన దృశ్యాన్ని సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియోలను చూసి చాలామంది ఆశ్చర్యానికి గురవుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
వీడియో వివరాల్లోకి వెళ్తే.. ఓ నదిలో పడవలో అత్యంత ప్రమాదకరమైన అనకొండ దాని తలను పడవ అంచున ఉంచి.. శరీరాన్ని పడవ నిండా ఉంచింది. అయితే, ఈ వీడియోలు ఆ అనకొండ పాము అన్ని పాముల్లా కాకుండా చాలా ప్రశాంతంగా కనిపించింది. అంతేకాకుండా ఒక వ్యక్తి దానికి పక్కనే ధైర్యంగా నిలబడి ఉండడం కూడా మీరు వీడియోలో గమనించవచ్చు. అనకొండ పాము ఎంతో నెమ్మదిగా కదులుతూ.. పడవలో నుంచి నదిలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే దాని తలభాగాన్ని పడవ అవతలి భాగంలో ఉంచినట్లు తెలుస్తోంది.
ఈ వీడియోలో కనిపిస్తున్న అనకొండ పాము.. దాదాపు 17 అడుగుల పొడవు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది చూడడానికి గోధుమ రంగుతో పాటు నలుపు రంగులో ఉండడం మీరు చూడొచ్చు. సాధారణంగా ఇలాంటి పాములు వేట కోసం అప్పుడప్పుడు నీటి దగ్గరికి దాహం తీర్చుకోవడానికి వచ్చే జంతువులపై దాడి చేసి.. వాటిని అమాంతం మింగేస్తూ ఉంటాయి. ఇలాంటి పాములు ఎక్కువగా అమెజాన్ అడవుల్లో మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. ఈ వీడియోని చూసిన చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు వారి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అయితే ఈ వైరల్ అవుతున్న వీడియో AI జనరేట్ చేసిందని.. ఇది నిజమైన వీడియో కాదని కామెంట్లలో రాసుకు వచ్చారు. మరి కొంతమంది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి