)
Giant Anaconda Video Watch Here: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ అనకొండ పాము కు సంబంధించిన వీడియో సంచలనం సృష్టిస్తోంది. అమెజాన్ అడవి నది తీరంలో నుంచి తీసిన వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది. సాధారణంగా సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి కానీ ఈ వీడియో అన్నిటికంటే చాలా ప్రత్యేకమైనది గా భావించవచ్చు. ఈ వీడియోలో మీరు ఎప్పుడూ చూడని అత్యంత అతిపెద్ద అనకొండ పాములు ఉగ్రరూపంలో నదిలో అత్యంత పొడవుగా లేచిన ఘటన ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలేంటో? మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో 'ANACONDA' అనే యూట్యూబ్ ఛానెల్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు. ఈ వీడియోకు "SCARY: Giant snake senses our presence" అనే క్యాప్షన్ పెట్టి షేర్ చేశారు.. అయితే ఇది జూలై 2వ తేదీన విడుదల అయినప్పటికీ.. ఇప్పటివరకు పది మిలియన్లకు పైగా సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించారు. ఇక ఈ వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఓ నదిలో అత్యంత ప్రమాదకరమైన అనకొండ పాము ఆకాశంలోకి 20 అడుగుల ఎత్తు లేచి.. అతి క్రూరంగా కనిపించడం మీరు చూడవచ్చు. ఇలా ఆ పాము దాదాపు ఏడు సెకండ్ల పాటు అలాగే గాల్లో ఉండడం మీరు చూడొచ్చు.
అమెజాన్ అడవుల్లో ఇలాంటి ప్రమాదకరమైన అనకొండలు చాలా ఉంటాయి. ఈ అనకొండ పాములు విషపూరితమైనవి కాకపోయినా.. వాటి దృఢమైన కండరాలతో శత్రువులను సులభంగా మట్టి కరిపించగలుగుతాయి. అంతేకాకుండా వాటికున్న భారీ శరీరంతో ఒకచోటి నుంచి మరొక చోటికి చాలా నెమ్మదిగా కదులుతూ ఉంటాయి. అలాగే ఈ పాములు ఎక్కువగా అడవి పరివాహక ప్రాంతాల్లో జీవించేందుకే ఇష్టపడుతూ ఉంటాయి. అలాగే నది దగ్గరికి దాహం కోసం వచ్చిన వివిధ జంతువులను ఎంతో చాకచక్యంగా పట్టుకొని ఆహారంగా మలుచుకుంటాయి.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసిన చాలా మంది.. వివిధ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అయితే ఈ వీడియోని చూసి.. నిజమైన వీడియోనే కాదని.. ఎవరో కావాలని AI వినియోగించి ఈ వీడియోని సృష్టించారని కామెంట్ లో తెలుపుతున్నారు. సాధారణంగా AI వినియోగంలోకి వచ్చినప్పటి నుంచి ఇలాంటి వీడియోలు తరచుగా వైరల్ అవుతూ వస్తున్నాయి. అయితే కొంతమంది తెలియని వారు ఇది నిజమైన వీడియోలోని భయపడుతూ కామెంట్లు పెడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook