)
Giant Anaconda Snake Video Viral: అమెజాన్ నదిలో జరిగిన ఒక భయంకరమైన ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తోంది. ఓ వృద్ధుడిని భారీ అనకొండ చుట్టూ చుట్టి.. నీటిలో ముంచడం, అతడిని పాము నుంచి రక్షించడానికి పడవలో ఉన్నవారు నీటిలో నుంచి బయటికి లాగడానికి సంబంధించిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన చూసిన చాలామంది నెటిజన్స్ ఆశ్చర్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా ఇలాంటి సంఘటనలు అమెజాన్ నది పరివాహక ప్రాంతాల్లో తరచుగా జరుగుతూ ఉంటాయని.. అప్పుడప్పుడు ఇలా వీడియోల రూపంలో వెలుగులోకి వస్తాయని కొంతమంది వన్యప్రాణి సంరక్షకులు చెబుతున్నారు. అయితే, ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
వీడియో వివరాల్లోకి వెళితే.. ఒక చిన్న పడవలో కొంతమంది ప్రయాణించడం మీరు గమనించవచ్చు. అందులోనే ఒక వృద్ధుడు నీటిలో ఉండడం గమనించవచ్చు. అయితే ఆ వృద్ధుని చుట్టూ అత్యంత ప్రమాదకరమైన అమెజాన్ అనకుండా చుట్టుకుని ఉండడం మీరు చూడొచ్చు. అయితే అతన్ని కాపాడేందుకు పడవలో ఉన్న కొంతమంది శతవిధాలుగా ప్రయత్నించడం మీరు చూడొచ్చు. అంతేకాకుండా పడవలో ఉన్న వారంతా ఆ వృద్ధుడిని నీటిలో నుంచి లాగేందుకు ఎంత ప్రయత్నించినప్పటికీ.. ఏ మాత్రం ఆ అనకొండ పాము అతన్ని వదిలిపెట్టడం లేదు..
ఆ వృద్ధుడిని అనకుండా పాము నుంచి రక్షించేందుకు పడవలో ఉన్న వారు ఎంతగానో ప్రయత్నించారు. వారి ఎంతో ప్రయత్నించినప్పటికీ ఆ పాము వదిలిపెట్టలేకపోయింది.. చివరకు నా వృద్ధుడిని అలాగే నీటిలో ఉంచి వారు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లు సమాచారం. ఈ వీడియో చూసిన చాలామంది ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయితే ఈ వీడియో చూసిన మరి కొంతమంది మాత్రం.. ఇది నిజమైంది కాదని.. ఎవరో కావాలని AI ద్వారా వీడియోని క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వదిలినట్లు చెబుతున్నారు.. ఏది ఏమైనా ఇలాంటి అరుదైన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం విశేషం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook