)
Giant Anaconda Snake Video Watch Here: ప్రస్తుతం ఒక సరస్సులో ఆశ్చర్యకరమైన మహాసర్పం కనిపించిన దృష్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను చూసి సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. సాధారణంగా అత్యంత విషపూరితమైన అనకొండ పాములు నదులతో పాటు ఎక్కువగా సరస్సుల్లో జీవిస్తూ ఉంటాయి. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
వీడియో వివరాల్లోకి వెళితే.. సరస్సు ఒడ్డున నీటిలో నుంచి అకస్మాత్తుగా ఓ అత్యంత భయంకరమైన అనకొండ పాము పైనకి లేవడం చూడొచ్చు.. ఈ పాము భారీ శరీరాన్ని నీటిపై తేలుతూ ఉంచింది. ఇది చుట్టుపక్కల వాతావరణాన్ని ఒక క్షణం పాటు స్తంభింపజేడం మీరు ఈ వీడియోలో క్లీయర్‌గా చూడొచ్చు.. ఈ వీడియోలో పామును చూస్తుంటే.. సుమారుగా 15 అడుగుల పొడవు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ పాము తోకను చుట్టూ ఉన్న నీటిలో అటు ఇటు కదలించడం మీరు చూడొచ్చు... దీంతో అలలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. ఈ వీడియోను చూసిన వారు "ఓహ్ మై గాడ్" అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. కామెంట్స్ చేస్తున్నారు..
సాధరణంగా ఇలాంటి పాములు చాలా అరుదుగా నీటి ప్రవాహంలో కనిపిస్తూ ఉంటాయి. అయితే, ఇలా కొన్ని సందర్భాల్లో మాత్రమే కనిపిస్తాయని ఈ వీడియో చూసిన కొంతమంది నిపుణులు తెలుపుతున్నారు. ఇలాంటి పాములు నదులతో పాటు సరస్సుల్లో ఏవైనా ఆటంకాలు ఏర్పడినప్పుడు ఇలా కనిపిస్తూ ఉంటాయట.. అంతేకాకుండా ఆహారం తీసుకునే సందర్భగాల్లో కూడా నీటిలో ఇలా పైకి లేచి నిలబడతాయని సమాచారం. అప్పుడప్పుడు ఇలా పాములు కనిపించడం సర్వసాధారణమని కొంతమంది నిపుణులు తెలుపుతున్నారు.
ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో నిజమైనది కాదని ఎవరో కావాలనే AI ద్వారా సృష్టించి పోస్ట్ చేశారని కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్స్ చేస్తున్నారు. అలాగే కొంతమంది ఈ వీడియో చూసి ఈ భారీ అనకొండ పాము నిజమని అనుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో AnacondaVideos అనే యూట్యుబ్ ఛానెల్ నుంచి పోస్ట్ చేశారు. ఇప్పటి వరకు ఈ వీడియోను 10 లక్షల మందికి పైగా వీక్షించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా 70 వేల మందికి పైగా సోషల్ మీడియా వినియోగదారులు లైక్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి