Giant Anaconda Video: ప్రపంచంలో అతి పెద్ద అనకొండ పాము.. భయపడే వారు ఈ వీడియో చూడొద్దు!

Giant Anaconda Snake Video Watch Here: ప్రస్తుతం 10 మీటర్ల అనకొండ పాముకు సంబంధించిన ఓ వీడియో విపరీతంగా వైరల్‌ అవుతోంది. అయితే ఈ వీడియోలో ఏం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 7, 2025, 04:26 PM IST
Giant Anaconda Video: ప్రపంచంలో అతి పెద్ద అనకొండ పాము.. భయపడే వారు ఈ వీడియో చూడొద్దు!

Giant Anaconda Video Watch: అతి భయంకరమైన పాముల్లో అనకొండ పాములు ఒకటి. ఇవి చాలా ప్రమాదకరమైనవి, చూడడానికి వీటి ఆకారం చాలా పెద్దగా ఉంటుంది. అంతేకాకుండా ఇవి అన్ని పాముల కంటే ఎక్కువ బరువును కలిగి ఉంటుంది. ఈ పాములు దక్షిణ అమెరికాలోని ఉష్ణమండలం ప్రాంతాల్లో ఎక్కువగా లభిస్తాయి. అలాగే అమెజాన్‌తో పాటు ఒరినోకో నదీ పరీవాహక ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అనకొండాల్లో కూడా ఆడ, మగ ఉంటాయ ఇందులో ఆడ అనకొండలు.. మగ అనకొండల కంటే చాలా పెద్దవిగా ఉంటాయి. అలాగే ఇవి 30 అడుగుల పొడవుతో పాటు 550 పౌండ్ల వరకు బరువును కలిగి ఉంటాయి. ఇవి ప్రపంచంలోనే అతిపెద్ద పాములగా భావిస్తూ ఉంటారు. 

Add Zee News as a Preferred Source

అనకొండలు ఎక్కువగా నీరు అధికంగా ఉంటే ప్రాంతాల్లో జీవిస్తూ ఉంటాయి. వీటి శాస్త్రీయ నామం "యునెక్టెస్"గా పేరు ఉంది. ఇవి నదులు, సరస్సులు, చిత్తడి నేలల్లో పిల్లలకు జన్మినిస్తూ ఉంటాయి. అలాగే వీటి కళ్లు చాలా ప్రత్యేకమైనవిగా చెప్పొచ్చు. ఎందుకంటే వీటి కళ్లపై నాసికా రంధ్రాలు ఉంటాయి. ఇవి నీటిలో కూడా చాలా చక్కగా చూడగలుగుతాయి. అంతేకాకుండా నీటిలో కూడా ఊపిరి పీల్చుకుంటాయని నిపుణులు తెలుపుతున్నారు. ఇవి సులభంగా ఇతర జంతువులను వేటాడగలుగుతాయి. ఎందుకంటే ఇవి చాలా పెద్ద శరీరాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి ఎంతో సులభంగా అన్ని రకాల జంతువులను వేటాడి ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి.

సాధారణంగా పైథాన్‌ స్నేక్స్‌ అడవి పందులు, జింకలు, పక్షులు, తాబేళ్లు, కైమన్‌లు (ఒక రకమైన మొసళ్లు)లను దాడి చేసి ఆహారంగా తీసుకుంటాయి. అనకొండలు ఎంతో సులభంగా పిల్లలకు జన్మనిస్తూ ఉంటాయి. ఇవి నేరుగా పిల్లలకు జన్మనిచ్చి.. వాటి రక్షణ కోసం కొద్దిరోజులు పిలలతోనే ఉంటాయి. ఈ పిల్లలు దాదాపు 2 అడుగుల పాటు ఉంటాయి..ఆడ అనకొండ సుమారు ఏడు నెలల పాటు ఆహారం తీసుకోకుండా ఉంటాయని సమాచారం. అయితే చాలా ఏళ్లుగా అడవులను నరకడం వల్ల ఈ పాములు జానావాసాల్లోకి వస్తున్నాయి. ఇలా వచ్చిన వీడియోలు తరచుగా నెట్టింటలో కనిపిస్తూ ఉంటాయి. తాజా అనకొండకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది.

ఈ వీడియోలో 10 మీటర్ల అనకొండ పామును కొంతమంది బుల్డోజర్‌తో రెష్క్యూ చేయడం మీరు గమనించవచ్చు. బ్రెజిల్‌లోని ఆనకట్ట నిర్మాణ స్థలం సమీపంలోని గుహలను తొలగించే సమయంలో ఈ పాము కనిపించిందని.. ఇది 33 అడుగుల భయంకరమైన అనకొండ అక్కడే పని చేస్తున్న కొంతమంది కార్మికులు తెలిపారు. దీనిని రక్షించేదుకు పలు సహాయక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం దీనికి సంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను 10 ఏళ్ల కింద Alexandre Flores అనే యూట్యుబ్‌ ఛానెల్‌ నుంచి పోస్ట్‌ చేశారు.

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News