King Cobra Bite Video: కింగ్‌ కోబ్రా కాటేస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఈ అరుదైన వీడియో చూస్తే తెలుస్తుంది..

King Cobra Snake Bite Rare Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో కింగ్‌ కోబ్రా స్నేక్‌ క్యాచర్‌ను కాటేసిన వీడియో వైరల్‌ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్స్‌ ఆశ్చర్యపోతున్నారు. అయితే దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 7, 2025, 02:50 PM IST
King Cobra Bite Video: కింగ్‌ కోబ్రా కాటేస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఈ అరుదైన వీడియో చూస్తే తెలుస్తుంది..

King Cobra Snake Bite Rare Video: అత్యంత పొడవైన విషపూరితమైన పాముల్లో కింగ్‌ కోబ్రాలు ఒకటి.. ఇవి చాలా ప్రమాదకరమైన పాములుగా చెప్పకుంటారు. కొంతమందిలో కింగ్‌ కోబ్రా కాటు ప్రాణాంతకంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం కింగ్‌ కోబ్రాలు ఇళ్లలో ఎక్కువగా సంచారం చేయడం వల్ల చాలా మంది వీటి కాటు బారిన పడుతున్నారు. అయితే వీటి కాటు బారిన పడేవారు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పాము కాటు వేసిన తర్వాత వెంటనే రెండు చిన్న రంధ్రాలు కనిపిస్తాయి. దీంతో పాటు చుట్టూ భారీగా వాపు వస్తుంది..

Add Zee News as a Preferred Source

కింగ్ కోబ్రా విషంలో అతి భయంకరమైన న్యూరోటాక్సిన్లు ఉంటాయి. ఇది మొదట మనిషి శరీరంలో నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీని వల్ల కొంతమందిలో మెదడు కూడా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ విషం రక్తప్రవాహంలో కలిసిపోయి.. శీరీరమంతా వ్యాప్తి చెందే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. దీని వల్ల మనిషి మరణించవచ్చని వైద్య శాస్త్ర నిపణులు తెలుపుతున్నారు. కొంతమందిలో పెద్దగా ప్రమాదం ఉండదని వారంటున్నారు. 

భారీ కింగ్ కోబ్రాలు న్యూరోటాక్సిన్లను అనే విషయం కలిగి ఉంటాయి. కాబట్టి ఒక్కసారి కాటేస్తే శరీరంపై తీవ్ర ప్రభావం పడి, వ్యక్తుల కండరాలు క్రమంగా బలహీనంగా మారి కళ్లు తిరడగం, తల తిరగడం వంటి సమస్యలు వస్తాయి. కొంతమందిలో శ్వాసకోశ కండరాలపై కూడా ప్రభావం చూపుతాయి. కాబట్టి పాము కాటుకు గురైన వారు సరైన సమయంలో తప్పకుండా వైద్యం చేయించుకోవడం చాలా మేలు..అలాగే పాము కాటేసిన వెంటనే ప్రథమ చికిత్స కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. తాజాగా సోషల్ మీడియాలో పాము కాటుకు సంబంధించిన వీడియో యూట్యుబ్‌లో వైరల్‌ అవుతోంది.

తాజాగా వైరల్‌ అవుతున్న వీడియాలో ఓ స్నేక్‌ క్యాచర్‌ పామున పట్టుకునేందుకు ఓ ఇంటికి వెళ్తాడు.. అయితే పామును పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పాము కాటుకు గురవుతారు. అయితే ఆ స్నేక్‌ క్యాచర్‌ ఏ మాత్రం బయపడకుండా పామును పట్టుకుని మరీ బంధిస్తాడు. ఆ తర్వాత స్నేక్‌ క్యాచర్ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకుంటారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు విపరీతంగా వైరల్‌ అవుతోంది. దీనికి సంబంధించిన వీడియో @Murliwale Hausla అనే యూట్యుబ్‌ ఛానెల్‌ నుంచి పోస్ట్‌ చేశారు. ఈ వీడియో గతంలో పోస్ట్‌ చేసినప్పటికీ ఇప్పుడు యూట్యుబ్‌లో ట్రెండ్‌ అవుతోంది. 

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News