)
Huge Python Viral Video: నేటి ఆధునిక డిజిటల్ ప్రపంచంలో అడవి జంతువుల, పాముల ప్రవర్తనను స్మార్ట్‌ఫోన్స్‌లో చిత్రికరించి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం సర్వసాధారణంగా మారింది. అయితే, ఇలా షేర్ చేసిన చాలా దృశ్యాలు సోషల్ మీడియాలో అప్పుడప్పుడు విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా యూట్యూబ్‌లో వైరల్ అవుతున్న ఒక వీడియో కూడా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ వస్తోంది. ఇంతకీ ఈ వీడియోలో ఏముందో? దాని సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ వైరల్ అవుతున్న షార్ట్ వీడియోలో ఒక భారీ కొండచిలువ నీలం రంగు బకెట్లో తెల్ల ఎలుకలను చూడడం మీరు గమనించవచ్చు.. ఈ దృశ్యం చూస్తున్నవారికి ముందు ముందు ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి గుండె వేగంగా కొట్టుకుంటుంది. కొండచిలువ ఎంత ఆకలితో ఉందో.. ఎలుకలను వేటాడడానికి ఎంత సిద్ధంగా ఉందో దాని కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తూ వస్తోంది..
బకెట్‌ను దూరం నుంచే చూస్తున్న కొండచిలువ పాము ఒక్కసారిగా తన తల బకెట్ లోపలికి పెట్టడం మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఆ వేగం చూస్తే, క్షణాలలో తన ఆహారాన్ని పట్టేసుకోవాలన్న ఉద్దేశ్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిని ముందుగానే గమనించిన అనేక ఎలుకలు భయంతో అటూ ఇటూ పరుగులు తీస్తుండగా..ఆ పాము చాలా వేగంగా ఒక ఎలుకను తన నోటితో పట్టుకోవడం చూడొచ్చు..
ఈ వీడియో చూసేవారికి ఆ తర్వాత కనిపించిన దృశ్యం మరింత ఉత్కంఠగా మారాయని చెప్పొచ్చు. కొండచిలువ ఆ ఎలుకను తన బలమైన కండరాలతో చుట్టుకుని ఉండడం చూడొచ్చు.. దాని కండరాలు ఎంత బలంగా ఉన్నాయో.. ఎంత వేగంగా ఎలుకను బిగించి పట్టుకుందో ఈ వీడియోలో చాలా స్పష్టంగా మీరు చూడొచ్చు... ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తోంది. దీనిని చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి