)
Giant Python Video Watch Telugu: ప్రస్తుతం సోషల్ మీడియాల్లో యూట్యూబ్ షార్ట్ వీడియోలు విపరీతంగా వైరల్ అవుతూ వస్తున్నాయి. ముఖ్యంగా కొంతమంది పోస్ట్ చేసే అత్యంత ప్రమాదకరమైన పాముల వీడియోలు వైరల్‌గా మారుతూ ఉంటాయి. తాజా కూడా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో పాము ఓ ఇంట్లో నుంచి బయటికి వెళ్లడం మీరు చూడొచ్చు. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
అత్యంత ప్రమాదకరమైన కొండచిలువ ఇంట్లో నుంచి పాకుతూ బయటికి వెళ్లడం చూసి అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. అంతేకాకుండా ఆ పాము ఇంట్లో నుంచి బయటికి రావడం ప్రారంభించింది. అయితే, దీనికి సంబంధించిన వీడియోనే ఇంటర్ననెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇక ఈ వీడియోకి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఈ వీడియోలో ఒక కొండచిలువ ఓ ఇంట్లో నుంచి బయటికి రావడం మీరు గమనించవచ్చు. ఇంటి ప్రధాన ద్వారం ముందు నుంచి పాము బయటికి వెళ్తోంది. ఈ వీడియోలో పాము అత్యంత భయానకంగా కనిపిస్తోంది.
ఈ వీడియోలో పామును చూస్తుంటే దాదాపు 20 అడుగులకుపైగా ఉండడం మీరు గమనించవచ్చు. ఈ పాము నెమ్మదిగా పచ్చిక మైదనం గుండా బయటికి వెళ్తోంది.. ఇలా వెళ్తున్న పామును అక్కడే ఉన్న కొంతమంది స్మార్ట్‌ఫోన్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో ఊహించిన స్థాయిలో వైరల్ అవుతోంది. అయితే, ఈ వీడియోను చూసి, చాలా మంది ఇది పెంచుకున్న పామని అందుకే ఇలా ఇంది ప్రధాన ద్వారం నుంచి బయటికి వెళ్తొందని సోషల్ మీడియా వినియోగదారులు తెలుపుతున్నారు.
సాధారణంగా కొండచిలువలు నిర్మానుష్య ప్రాంతాల్లో ఎక్కువగా జీవిస్తూ ఉంటాయి. అంతేకాకుండా పంట పొలాల్లో మడుగులు, నదులు వంటి ప్రాంతాల్లో జీవిస్తూ ఉంటాయి. అయితే అడవుల్లో విస్తీర్ణత తగ్గిపోవడం వల్ల చాలా వరకు పాములు మానవ నివాసాల్లోకి సంచారం చేస్తున్నాయని కొంతమంది నిపుణులు తెలుపుతున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో @jaysreptiles5457 అనే యూట్యుబ్ ఛానెల్ నుంచి పోస్ట్ చేస్తున్నారు. ఈ వీడియోను 38 వేయిల మందికి పైగా సోషల్ మీడియా లైక్ చేశారు. ఇప్పటికీ కొన్ని లక్షల మందికి పైగా సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి