Python In Flood Water Video: వామ్మో.. ముంబై వరదల్లో ప్రత్యక్షమైన భారీ కొండ చిలువ.. వీడియో వైరల్..

Big python in navi Mumbai video: నవీ ముంబై వీధులలో భారీ కొండ చిలువ కొట్టుకుని వచ్చింది.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Jun 1, 2025, 12:06 PM IST
  • రోడ్డుపైకి వచ్చిన భారీ కొండ చిలువ..
  • షాక్ లో నెటిజన్ లు..
Python In Flood Water Video: వామ్మో.. ముంబై వరదల్లో ప్రత్యక్షమైన భారీ కొండ చిలువ.. వీడియో వైరల్..

Giant python spotted in navi Mumbai in floodwater video: కొన్ని రోజులుగా దేశమంతట విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.ఈ నేపథ్యంలో ఎక్కడ చూసిన కూడా వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలలో భారీగా వరద నీరు వచ్చిచేరుతుంది. అంతేకాకుండా.. రుతుపవనాలు ఎర్లీగా రావడం వల్ల  వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారిపోయింది.

Add Zee News as a Preferred Source

ఈ క్రమంలో ప్రస్తుతం ముంబైలో కొన్ని రోజులుగా కుండ పోత వాన దంచికొడుతుంది. ఈ క్రమంలో లోతట్లు ప్రాంతాల్లోని ఇళ్లలో భారీగా నీరు వచ్చిచేరింది.  ముంబైనగర మున్సిపాల్ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు.. ఇతర ప్రదేశాలకు వెళ్లాలని పలు సూచనలు చేశారు.

 

అయితే..  ప్రస్తుతం ముంబై అంతట కూడా భారీవానకు చిగురుటాకుల వణికిపోయింది. ఈ క్రమంలో తాజాగా.. ముంబైలోకి వీధులలో ఒక భారీ కొండ చిలువ నీళ్లలో కొట్టుకుని వచ్చింది. కొండ చిలువను అక్కడున్న కొంత మంది గమనించారు. వెంటనే తమ ఫోన్ లలో ఈ కొండ చిలువను రికార్డు చేశారు.

Read more: King Cobra Video: అక్కడ నీకేం పని మావా..?.. బెడ్‌లో దూరిన భారీ నాగు పాము.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో స్నేక్ టీమ్ అక్కడకు చేరుకుని కొండ చిలువను కాపాడి, అడవుల్లో వదిలేశారు.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News