Girl rescued venomous snake video goes viral: సాధారణంగా చాలా మంది పాములంటే భయంతో గజ్జని వణికిపోతారు. పాము అక్కడుంటే.. ఇట్నుంచీ ఇటే పారిపోతారు. పాము అని.. పేరు ఎత్తడానికి కూడా అస్సలు డేర్ చేయరు. కానీ మరికొందరు పాములు కన్పిస్తే వెంటనే స్నేక్ టీమ్ లకు సమచారం ఇస్తారు. పాములున్న దరిదాపుల్లోకి కూడా అస్సలు వెళ్లరు. మొత్తంగా పాములు ఉన్నాయంటే మాత్రం దూరంగా పారిపోతారు.
కొన్నిసందర్బాలో పాములు ఇంట్లోకి వస్తుంటాయి. ఎలుకలు ఎక్కువగా ఉంటే.. పాములు అక్కడ ఉంటాయంటారు. పాములు ఇళ్లలోకి వస్తే.. కొందరు వెంటనే స్నేక్ టీమ్ లకు చెప్పి వాటిని పట్టుకునే వరకు జాగ్రత్తగా పామును గమనిస్తునే ఉంటారు. ఇక్కడోక యువతి డేరింగ్ గా పామును పట్టేందుకు వచ్చింది.
కానీ అక్కడున్న మగాళ్లంతా దూరంగా పారిపోతుంటే.. వట్టి చేతులతో డేరింగ్ గా వచ్చి పామును పట్టుకుంది. అది విడిపించుకునేందుకు ఎంతగా ట్రై చేసిన ఆమె మాత్రం అస్సలు వదల్లేదు. మొత్తంగా పామును పట్టుకుని మరీ దానికి కిస్ కూడా ఇచ్చింది.
ఆ తర్వాత పామును దూరంగా వెళ్లి వదిలేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు మాత్రం షాక్ అవుతున్నారు. ఈమెను ఎవరైన పెళ్లి చేసుకుంటే.. వాళ్లను పాములు పట్టమని చెప్తుందేమో అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.









