
Girl Sleeping With big python video: సాధారణంగా పాములు, కొండ చిలువల వీడియోలు ఇటీవల నెట్టింట తెగ వైరల్‌గా మారుతున్నాయి. మొత్తంగా నెటిజన్లు సైతం పాముల వీడియోలు చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవల కాలంలో చాలా మంది కుక్కలు, పిల్లులతో పాటు, పాములు, కొండ చిలువలు, క్రూర జంతువుల్ని సైతం పెంచుకుంటున్నారు. మరీ భయంలేకనో మరేంటో కానీ.. క్రూర జంతువులతో ఫోటోలు దిగుతూ రచ్చ చేస్తున్నారు. సాధారణంగా పాములు, కొండ చిలువల వీడియోలకు నెట్టింట డిమాండ్ ఎక్కువగా ఉందని చెప్పుకొవచ్చు.
అయితే.. పాములు కన్పిస్తే చాలా మంది స్నేక్ సొసైటీ వాళ్లకు సమాచారం ఇస్తారు. పాములు కాటువేస్తే వెంటనే సరైన ట్రీట్మెంట్ తీసుకొకపోతే వెంటనే ప్రాణాలు గాల్లొ కలుస్తాయి. ఇక కొండ చిలువలు మనుషుల్ని అమాంతం మింగుతాయి. కొండ చిలువలు మనుషుల్ని చుట్టేస్తాయి.ఆతర్వాత ఎముకలు విరిగిపోయేలా గట్టిగా చుట్టేసుకుంటాయి. ఆ తర్వాత.. ఆ మనిషి లేదా జంతువులు ప్రాణాలు పోవాల్సిందే. ఈ క్రమంలో కొందరు కొండ చిలువలతో భయంకరంగా రీల్స్ చేస్తున్నారు. అసలు.. అవి ఎంత డెంజర్ అని తెలిసి కూడా లేనీ పొనీ స్టంట్ లు చేస్తున్నారు.
Nope nope nope! pic.twitter.com/c42MbJP5VB
— Fascinating (@fasc1nate) April 7, 2025
ప్రస్తుతం ఒక యువతి బెడ్ మీద పడుకుని తన పక్కన ఒక భారీ కొండ చిలువను పెట్టుకుంది. అది కదులుతుంటే.. ఆమె దాని మీద బెడ్‌షిట్ వేసుకుని మరీ అదేదో చిన్న పిల్లాడ్ని బుజ్జగిస్తున్నట్లు ఆమె వెర్రీ పనులు చేస్తుంది.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. యువతి తన పక్కన భారీ కొండ చిలువను బుజ్జగిస్తు, వెరైటీగా ప్రవర్తిస్తుంది. అడవుల్లో కొండ చిలువలు తమకన్న నాలుగురెట్లు పెద్దగా ఉండే జీవుల్ని సైతం అమాంతం మింగేస్తాయి.
చాలా సందర్భాలలో ఏనుగులు, సింహల వంటి జంతువులు సైతం కొండ చిలువలంటే భయంతో దూరంగా పారిపోతుంటాయి. ఇటీవల చాలా సందర్భాలలో కొండ చిలువలు రోడ్లమీదకు కూడా వస్తున్నాయి. అదే విధంగా అడవులకు దగ్గరగా ఉన్న ప్రాంతాలలో పాములు, కొండ చిలువలు తరచుగా వస్తుంటాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇదేంట్రా బాబోయ్ అని ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.మరికొందరు అది బలంగా చుట్టుకుంటే.. ఆమాత్రమైన మిగలవు కదా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe