Viral Video: రెచ్చిపోయిన కేటుగాడు.. మంచి నీళ్లు అడిగి ఇంట్లోకి ప్రవేశించి.. వైరల్‌గా మారిన వీడియో..

Hyderabad: మహిళ ఉదయాన్నే ఇంటిపనులు చేసుకుంటుంది. ఇంతలో ఒక వ్యక్తి దాహంగా ఉందని నీళ్లు అడిగాడు. ఆమె లోపలికి వెళ్లి నీళ్ల బాటిల్ ను తీసుకొని రావడానికి వెళ్లింది.ఈ క్రమంలో అతను కూడా ఆమెను ఫాలో అయ్యాడు.  

Written by - Inamdar Paresh | Last Updated : Mar 12, 2025, 04:09 PM IST
  • హైదరాబాద్ చోరీ ఘటన..
  • ఆందోళన వ్యక్తం చేస్తున్న నెటిజన్లు..
Viral Video: రెచ్చిపోయిన కేటుగాడు.. మంచి నీళ్లు అడిగి ఇంట్లోకి ప్రవేశించి.. వైరల్‌గా మారిన వీడియో..

Chain snatching in kphb Hyderabad: ఇటీవల కాలంలో కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు.ఈజీగా డబ్బులు సంపాదించాలని చోరీలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఒంటిరిగా ఉంటున్న మహిళలు,వయసులో పెద్ద వాళ్లనుహ టార్గెట్ చేసుకుంటున్నారు. బైక్ ల మీద వచ్చి.. ఏదో అడ్రస్ అడిగినట్లు చేస్తున్నారు. ఆ తర్వాత చోరీలకు పాల్పడుతున్నారు. మరికొందరు ఇంటి దగ్గరకు వచ్చి తాగేందుకు నీళ్లు అడుగుతున్నారు.ఆ  తర్వాత మెల్లగా వారి వెనకాల వెళ్లి చోరీలు చేస్తున్నారు. అంతేకాకుండా.. మరికొందరు గల్లీల దగ్గర నిలబడి.. బైక్ ల మీద వెళ్లే వివాహితలను టార్గెట్ చేసుకుంటున్నారు.

Add Zee News as a Preferred Source

మహిళలను ఫాలో అయ్యి.. ఏదో మాట్లాడినట్లు చేసి బంగారం, చైన్ లను కాజేస్తున్నారు. ఇటీవల అనేక ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. సోషల్ మీడియాలో నిత్యం చైన్ స్నాచింగ్ ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం హైదరాబాద్ లోని కేపీహెచ్ బీ లో చోటు చేసుకున్న ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

 

హైదరాబాద్ లోని కేపీహెచ్ బీలో ఇటీవల టెంపుల్ బస్టాండ్ సమీపంలో ఇంట్లో మహిళ తన పనులు చేసుకుంటుంది. ఇంతలో గేటు దగ్గర  ఒక వ్యక్తి వచ్చి తాగేందుకు నీళ్లు కావాలని అడిగాడు. పాపం.. ఎండాకాలం అని సదరు మహిళమంచి మనసుతో అతడిని నీళ్లు ఇచ్చేందుకు లోపలికి వెళ్లింది. కానీ ఆ కేటుగాడు దొంగ అని గుర్తించలేకపోయింది. ఆమె లోపలికి వెళ్లగానే.. ఆమె వెనుకాల ఇతగాడు వెళ్లాడు.

ఆమె ఇంట్లోకి ప్రవేశించి.. నీళ్లు తాగుతున్నట్లు నటించి.. ఇంట్లో ఎవరు లేరని చూసి.. రెప్పపాటులో.. ఆమె మెడలోని రెండున్నర తులాల బంగారం మంగళసూత్రంను తెంపుకుని అక్కడి నుంచి పారిపోయాడు. ఆమె లబో దిబో అంటూ కేకలు వేస్తు అతగాడ్ని పట్టుకునేందుకు ప్రయత్నించింది.

Read more: Snakes in AC Video: వామ్మో.. ఏసీలో కుప్పలు.. తెప్పలుగా పాములు.. వీడియో చూస్తే జడుసుకోవడం పక్కా..

కానీ అతను మాత్రం జెట్ స్పీడ్ లో అక్కడి నుంచి పారిపోయాడు.ఈ చోరీ ఘటన అక్కడున్న సీసీ ఫుటేజీలో రికార్డు అయ్యింది. అతను తన ముఖానికి క్యాప్ కూడా పెట్టుకున్నాడు.ఈ వీడియో వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటజన్ లు మాత్రం షాక్ అవుతున్నారు. నేటి కాలంలో ఒకరికి  పాపం.. అంటే.. మనకే రిటర్న్ గా చెడు జరుగుతుందని కొంత మంది కామెంట్లు చేస్తున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News