
Gold Rate Bill Viral: బంగారం ధరలు ఎవరు ఊహించని స్థాయిలో పెరుగుతూ పోతున్నాయి. గతంలో రూ. 20 వేలకు తులం ఉన్న బంగారం ఇప్పుడు ఏకంగా రూ.90 వేలకు పైగా చేరింది. ధరలు పెరిగినప్పటికీ బంగారం ప్రియులు ఏమాత్రం వదలకుండా కొనుగోలు చేస్తున్నారు. గత రెండు రోజుల క్రితం లక్ష దాటిన బంగారం ధర ఇప్పుడు తగ్గుతూ వస్తోంది. గత రెండు రోజులతో పోలిస్తే ఈరోజు బంగారం ధర కాస్త తగ్గింది. అయితే నిపుణులు మాత్రం భవిష్యత్తులో బంగారం ధరలు కలలో కూడా ఊహించని స్థాయిలో పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు.. మరి కొంతమంది నిపుణులు అయితే ఒక్కసారిగా బంగారం ధరలు పడిపోవచ్చని భావిస్తున్నారు. ఏది ఏమైనా బంగారం ఒక్కసారి పెరగడంతో స్వర్ణకారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో అతి తక్కువగా ఉండే బంగారం ధరలకు సంబంధించిన కొన్ని బిల్ రిసిట్లు వైరల్ గా మారాయి.
ఇటీవల తొలిసారిగా భారతదేశంలో 24 క్యారెట్లు కరిగిన ఒక గ్రాము బంగారం ధర రూ.10,000 మార్కును దాటిపోయింది. ఈ ధరలను చూసి అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.. ఏప్రిల్ ఒకటవ తేదీన రూ. 8 వేల దగ్గర ఉన్న బంగారం ధర ఏప్రిల్ 22వ తేదీ వచ్చేసరికి ఏకంగా రూ.9 వేలకు చేరింది. ఎవరు ఊహించని స్థాయిలో మార్కెట్లోని బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క ధర వస్తు జనాలకు పిచ్చెక్కిస్తోంది. ఒక నెలలోనే భారీగా పెరిగిన బంగారం ధర.. మరో నెలలో తగ్గుతూ వస్తోంది. అయితే తాజాగా 63 ఏళ్ల నాటి బంగారం కొన్న పాత బిల్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 1959 నాటి ఈ బిల్లును చూసి సోషల్ మీడియా వినియోగదారులు షాక్ అవుతున్నారు..
ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బంగారం కొనుగోలు చేసిన బిల్లు 1959 సంవత్సరం నాటిది.. ఈ బిల్లులో మీరు క్లియర్‌గా గమనిస్తే రూ.621, రూ.251 పెట్టి విలువైన బంగారు వస్తువులను కొనుగోలు చేసినట్లు చూడొచ్చు. అంతేకాకుండా అందులో వెండి వస్తువుల ధరలు కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు. మొత్తం బిల్లు దాదాపు రూ.909 అయ్యింది.. ఈ బిల్లు ప్రకారం 1959లో 10 గ్రాముల బంగారం కేవలం రూ.113 అని అర్థం చేసుకోవచ్చు.. అంతేకాకుండా అప్పుడు వెండి ధర కూడా చాలా చీప్ గా ఉండేది.. అందుకే చాలామంది వెండితో తయారుచేసిన కంచాలలో భోజనాలు చేసేవారు.. ప్రస్తుతం ఈ బంగారు బిల్లుకు సంబంధించిన పాత రిసిప్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తోంది..
ఈ పాత బంగారం బిల్లుకు సంబంధించిన ఫోటోను @upscworldofficial అనే ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మహారాష్ట్రకు చెందిన ఓ బంగారు నగల దుకాణంలో శివలింగ అనే వ్యక్తి దీనిని కొనుగోలు చేసినట్లు వెళ్లడైంది. అయితే ఈ బంగారు బిల్లుకు సంబంధించిన పోస్ట్ ఇప్పుడు విస్తృతంగా వైరల్ గా మారింది. ఈ పోస్ట్ చూసిన చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు.. కొంతమంది అయితే కామెంట్లు కూడా చేస్తున్నారు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి