Rare Green Mamba Viral Video Watch Now: సాధారణంగా మనం ఎన్నో పాములను చూసి ఉంటాం.. కానీ గ్రీన్ కలర్ లో ఉండే అతి విషపూరితమైన మాంబాను చూశారా? వీటిని తూర్పు ఆకుపచ్చ మాంబా (Dendroaspis angusticeps) అని కూడా అంటారు. వేగంగా కదిలే పాముల్లో ఇవి ఒకటని సమాచారం.. ప్రధానంగా ఈ పాములు తూర్పు దక్షిణ ఆఫ్రికాల్లో తీర ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ప్రకాశవంతమైన మెరిచే చర్మాన్ని కలిగి ఉండడమే కాకుండా ఇవి ఎక్కువగా చెట్లపై జీవించే స్వభావం కలిగి ఉంటాయని సమాచారం. సాధారణంగా వీటి పొడవు 1.8 మీటర్ల కంటే ఎక్కువగానే ఉంటుంది. చూడడానికి ఆకుపచ్చ రంగులో ఉన్నప్పటికీ ఇది ఎంతో ప్రమాదకరమైన పామని పేరు పొందింది.. ఈ పాములు ఎక్కువగా సహజ వాతావరణంలో పెరుగుతాయి కాబట్టి చర్మంపై కొన్ని ప్రత్యేకమైన మచ్చలను కలిగి ఉంటాయట. అంతేకాకుండా దీని తల చిన్నదిగా ఉండి కళ్ళు పెద్దవిగా గుండ్రని ఆకారం కలిగి ఉంటాయి.
ఈ పాములు ఎక్కువగా తీర ప్రాంతాల్లో జీవించేందుకు ఇష్టపడతాయట. అంతేకాకుండా చిత్తడి అడవి ప్రాంతాల్లో ఎక్కువగా వృక్షాలు ఉండే నీళ్ళల్లో ఈ ఆకుపచ్చ మాంబాలు ఉంటాయి. ఇప్పటికీ కెన్యా, టాంజానియా, మొజాంబిక్, జింబాబ్వే, దక్షిణాఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో ఈ పాములు జీవనం కొనసాగిస్తూనే ఉన్నాయి. ఈ పాములు ఎక్కువగా భయపడుతూ ఉంటాయి.. అందుకే చప్పుడయిన వెంటనే దూరంగా వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తాయట. అలాగే ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతాయట. ఇవి ఎక్కువగా పగటిపూట వేటను కొనసాగిస్తాయి. ఈ పాములు ఏవైనా కీటకాలపై దాడి చేసే సమయంలో ముందుగా బెదిరించి.. ఆ తర్వాత దాడి చేస్తాయని సమాచారం.. ఈ పాము ఒక్కసారి దాడి చేస్తే అందులో నుంచి వచ్చే విషయం ప్రమాదకరంగా మారి మరణించే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలా అరుదుగా లభిస్తూ ఉంటాయి. తాజాగా ఈ పాము కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి గ్రీన్ మాంబాను పట్టుకొని ఉండడం మీరు గమనించవచ్చు. అలాగే అక్కడే ఉన్న ఇద్దరు వ్యక్తులు ఆ పామును స్టిక్‌తో పట్టుకొని ఉండడం మీరు చూడొచ్చు. ఆ తర్వాత ఓ వ్యక్తి ఆ పాము తలను చేత్తో పట్టుకొని ఓ చిన్న గ్లాస్ డబ్బాలు పాము తలపెట్టి విషాన్ని బయటికి తీయడం చూడవచ్చు. ఆ వ్యక్తి ఏమాత్రం భయపడకుండా పాము విషాన్ని బయటికి తీయడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను @coyotepeterson అని యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను కొన్ని కోట్ల మందికి పైగా సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించారు. అంతేకాకుండా కొన్ని లక్షల మంది ఈ వీడియోను లైక్ చేశారు.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









