)
Green Vipers Viral Video: సాధారణంగా గ్రీన్ వైపర్ స్నేక్స్ ఆసియాతో పాటు అమెరికా ఖండాల్లో విపరీతంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ పాములు ప్రత్యేకమైన రంగును కలిగి ఉండడమే కాకుండా అరుదైన ప్రవర్తనతో జీవిస్తూ ఉంటాయి. వాటి శరీరం సాధారణ ఆకుపచ్చ రంగులో కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇవి ఎక్కువగా చెట్లపై నివసిస్తూ ఉంటాయి. చెట్లకు సంబంధించిన పొదల్లో దాగిఉండడం వీటి ప్రత్యేకత. ఇవి సాధారణంగా పొడవుగా సన్నంగా కనిపిస్తూ ఉంటాయి. కొన్ని వైపర్స్ అయితే చాలా లావుగా కూడా ఉంటాయి. ఇందులో కొన్ని జాతులకు సంబంధించిన పాములు ఒక మీటర్ మాత్రమే ఉంటే.. మరికొన్ని జాతులకు సంబంధించిన పాములు దాదాపు నాలుగు నుంచి ఐదు మీటర్లు కూడా ఉంటాయి.
ఈ గ్రీన్ వైపర్ స్నేక్స్ కళ్ళు సాధారణ గోధుమ రంగులోనే కనిపిస్తాయి. ఇవి రాత్రిపూట ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటాయని, వీటి కంటి దృష్టి అప్పుడే అనుకూలంగా ఉంటుందని పరిశోధనకులు చెబుతున్నారు. అయితే వీటికి ముక్కు కంటి మధ్య చిన్నని గుంటలాంటి నిర్మాణం ఉంటుంది. ఇది దాని ముఖానికి ప్రత్యేకమైన గుర్తింపు అందిస్తుంది.. ఈ పాములు ఎక్కువగా వేటాడడానికి రాత్రి సమయాలు మాత్రమే ఎంచుకుంటాయట. అంతేకాకుండా వేడి రక్తం కలిగిన జీవులను మాత్రమే ఎర్రగా తింటారని పరిశోధకులు తెలుపుతున్నారు. అలాగే వీటికి పొడవాటి విషపు కోరలు కూడా ఉంటాయి.
గ్రీన్ వైపర్స్ గుడ్లు పెట్టకుండా పిల్లలకు నేరుగా జన్మనిస్తూ ఉంటాయి. ఇవి అన్ని సాధారణ పాముల్లా కాకుండా చాలా ప్రత్యేకమైన పొట్టను కలిగి ఉంటాయి. ఎక్కువగా ఈ పాములు థాయిలాండ్, లావోస్, వియత్నాం, కంబోడియా, ఇండోనేషియా, మలేషియా కనిపిస్తూ ఉంటాయని సమాచారం. తాజాగా గ్రీన్ వైపర్ పాము కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ గా మారింది. ఈ వీడియోలో పాము నేరుగా తన పిల్లలకు జన్మనిస్తున్న సన్నివేశాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసేలా చేస్తున్నాయి. అయితే ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
గ్రీన్ వైపర్స్ ఎక్కువగా చెట్లపై ఉండే వాటి పిల్లలకు జన్మనిస్తూ ఉంటాయి. అయితే ఈ వీడియోలో కూడా ఈ పాము చెట్టుపై ఉండి నేరుగా పాము పిల్లకు జన్మనిస్తోంది. ఈ వీడియోలో మీరు పాము పొట్టలో నుంచి నేరుగా ఓ చిన్న పిల్ల బయటికి రావడం గమనించవచ్చు అంతేకాకుండా పొట్టలో నుంచి బయటికి వచ్చిన పిల్ల అటు ఇటు చూడడం కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడు ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోను @thereptilereportofficial అనే ఇంస్టాగ్రామ్ ఖాతా నుంచి పోస్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను 59,000 మందికి పైగానే సోషల్ మీడియా వినియోగదారులు లైక్ చేశారు. అంతేకాకుండా కొన్ని లక్షల మంది ఈ వీడియోని వీక్షించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook