Bride Baby Birth: పెళ్లయిన రెండు రోజులకే బిడ్డకు జన్మనిచ్చిన వధువు.. షాక్‌లో పెళ్లి కొడుకు

Groom Stunned Bride Gives Birth To Child After Wedding Two Days: పెళ్లయినా తెల్లారే పెళ్లి కొడుకుకు భారీ షాక్‌ తగిలింది. పెళ్లి చేసుకున్న తర్వాతి రోజే తన భార్య బిడ్డకు జన్మనివ్వడంతో దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఈ సంఘటన సామాజిక మాధ్యమాల్లో రచ్చ రేపుతోంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 6, 2025, 07:38 PM IST
Bride Baby Birth: పెళ్లయిన రెండు రోజులకే బిడ్డకు జన్మనిచ్చిన వధువు.. షాక్‌లో పెళ్లి కొడుకు

Bride Gives Birth To Child: గతంలో అంటే అబ్బాయిలకు డిమాండ్‌ ఉండేది. కానీ ఇప్పుడు అమ్మాయిలకు భారీ డిమాండ్‌ ఏర్పడడంతో అబ్బాయిలు ఛాయిస్‌గా మారారు. ఎవరిని చేసుకోవాలనే అమ్మాయిలు నిర్ణయించుకుంటుండడంతో అబ్బాయిలకు పెద్ద కష్టమొచ్చింది. ఈ క్రమంలోనే ఓ యువతి పెళ్లి కొడుకుని భారీ మోసం చేసింది. వేరొకరితో శారీరక సంబంధం కలిగి ఉండి గర్భం దాల్చింది. ఆ విషయం తెలియకుండా పెళ్లి చేసుకోగా.. వివాహామైన తర్వాతి రోజే ఆమె ప్రసవించడంతో పెళ్లి కొడుకు భారీ షాక్‌కు గురయ్యాడు. ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. వివరాలు ఇలా ఉన్నాయి. 

Add Zee News as a Preferred Source

Also Read: Konda Surekha Tears: విషాదంలో మంత్రి కొండా సురేఖ.. తట్టుకోలేక బోరున ఏడ్చేశారు

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయోగ్‌రాజ్‌లో ఫిబ్రవరి 24వ తేదీన ఓ యువకుడికి అంగరంగ వైభవంగా వివాహమైంది. మరుసటి రోజు భర్తతో కలిసి కొత్త పెళ్లి కూతురు అత్తారింటికి వచ్చింది. ఫిబ్రవరి 26వ తేదీన ఉదయం అత్తగారింట్లో సందడి చేసింది. వచ్చిన బంధువులు, స్నేహితులకు మర్యాదలు చేసింది. అయితే ఏమైందో కానీ సాయంత్రం తీవ్ర కడుపు నొప్పి రావడంతో తట్టుకోలేకపోయింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా ఆమె పురిటినొప్పులతో బాధపడుతోందని వైద్యులు చెప్పడంతో వరుడితోపాటు అతడి కుటుంబసభ్యులు నిర్ఘాంతపోయారు. ఆ కొద్దిసేపటికే వధువు పండంటి బిడ్డకు జన్మనిచ్చిందని వైద్యులు చెప్పడంతో షాక్‌కు గురయ్యారు.

Also Read: Weather Update: తెలంగాణకు 'చల్లటి కబురు'.. రాబోయే రెండు రోజులు తగ్గనున్న ఉష్ణోగ్రతలు

అనంతరం వెంటనే తన అత్తామామలతో పంచాయితీ పెట్టాడు. పెళ్లయిన తెల్లారే బిడ్డకు జన్మనిచ్చిన ఆమెను వధవుగా స్వీకరించేందుకు వరుడు నిరాకరించాడు. తనకు వద్దని చెప్పేశాడు. వధువు పెళ్లికి ముందే వేరొకరితో ఆమె శారీరక సంబంధం కలిగి ఉందని.. అతగాడు నిరాకరించడంతో గర్భం పెరిగింది. ఇక చేసేదిలేక కుటుంబసభ్యులు ఆ విషయాన్ని కప్పిపుచ్చి విషయం చేసినట్లు తేలింది.

ఈ విషయమై వరుడి సోదరి సంచలన విషయాలు వెల్లడించింది. పెళ్లి సమయంలో గర్భం దాల్చినట్లు కనిపించకుండా వధువు, ఆమె కుటుంబసభ్యులు జాగ్రత్త పడ్డారని వరుడి సోదరి తెలిపింది. పెళ్లి సమయంలో వధువు పెద్ద లెహంగా ధరించి గర్భం కనిపించకుండా చేసింది. ఇంటికి వచ్చాక కూడా పెద్ద దుస్తులు ధరించి జాగ్రత్త పడిందని వరుడి కుటుంబసభ్యులు తెలిపారు. ఇప్పుడు వధువు బిడ్డకు జన్మనివ్వడంతో తాము మోసపోయినట్లు వరుడి కుటుంబసభ్యులు లబోదిబోమంటున్నారు. దీనిపై నెట్టింట్లో తీవ్ర సంచలనం రేపుతోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News