Costly Masks: కరోనావైరస్ ( Coronavirus ) ప్రపంచం మొత్తాన్ని సమస్యల్లోకి నెట్టేస్తే.. కొంత మంది ఈ సమస్యను వ్యాపారానికి కొత్త మార్గంగా మలచుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం మహారాష్ట్రకు చెందిన శంకర్ కురడే ( Shankar Kurade ) బంగారంతో  మాస్క్ ( Golden Mask ) చేయించుకున్నాడు. తాజాగా గుజరాత్‌కు చెందిన ఒక జ్యూవెల్లరీ షాప్ యజమాని డైమండ్‌ మాస్క్ ( Diamond Mask ) తయారు చేస్తున్నాడు. ఈ డైమండ్ మాస్క్ ప్రారంభ ధర లక్ష 45 వేలు కాగా.. టాప్ బ్రాండ్ మాస్క్ ధర నాలుగు లక్షలుగా నిర్ణయించారు. Also Read:Apsara Rani: అప్సరా రాణీ.. సోషల్ మీడియాను ఏలుతున్న కొత్త బ్యూటీ



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీనిపై స్పందించిన షాపు యజమాని "లాక్‌డౌన్ ( Lockdown ) తరువాత అప్పటి వరకు వాయిదా పడిన పెళ్లి లాంటి శుభకార్యాలు ( Marriage Ceremony) మళ్లీ ప్రారంభం అవ్వడం మొదలయ్యాయి. దాంతో కొత్త ముహూర్తాలు పెట్టుకున్న వాళ్లు పెళ్లి దుస్తులకు తగిన విధంగా మాస్క్‌లు తయారు చేయించుకోవాలి అనుకుంటున్నారు. అందుకే వారి కోసం డైమండ్ మాస్క్ సిద్ధం చేశాము" అని తెలిపారు.


కోవిడ్-19 ( Covid-19 ) సంక్రమణ సమయంలో శుభకార్యాలు తగ్గాయి. ఎక్కడో చోట జరిగానా వచ్చే వాళ్లు అంతగా లేరు. సహజంగా వాటికి అయ్యే ఖర్చు కూడా తగ్గాయి కాబట్టి జనాలు ఆ డబ్బును ఇలా ఖర్చు చేస్తున్నారని నెటిజెన్స్ అభిప్రాయపడుతున్నారు.  జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..


 Also read: COVID-19 vaccine: కోవిడ్-19 వ్యాక్సిన్‌పై స్పష్టత వచ్చేసింది