Haldi Function In Metro Viral Video: ఢిల్లీ మెట్రో కు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే ఇందులో చాలా వీడియోలు అసభ్యకరమైనవే.. అంతేకాకుండా ఇందులో చాలామంది చేసిన వింత చేష్టలు ఇతర ప్రయాణికులకు చిరాకు పుట్టించినవే.. దీంతో చాలామంది ప్రయాణికులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా పబ్లిక్ మెట్రోలో అసభ్యకరమైన పనులు చేయడం తప్పే.. తాజాగా ఆగ్రా మెట్రో కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. మెట్రోలో ఇలా కూడా చేయొచ్చా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ వైరల్ అవుతున్న వీడియోలో ఏముందో? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
తాజాగా వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళితే.. ఏకంగా కొంతమంది మహిళలు ఓ మెట్రో కోచ్ లో హల్దీ ఫంక్షన్ జరుపుకున్నారు. ఈ హల్దీ ఫంక్షన్ కు సంబంధించిన ఓ వీడియో విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది. అయితే ఆగ్రామెట్రో యాజమాన్యం గత కొన్ని నెలల నుంచి ప్రయాణికులకు ప్రత్యేకమైన మెట్రో కోచ్ ని అద్దెకు ఇస్తుందని.. ఈ కోచ్ ఎవరైనా బుక్ చేసుకొని ఎలాంటి ఫంక్షన్స్ అయినా చేసుకోవచ్చని ఈ వీడియోలో ఓ ఇన్ఫ్లుయెన్సర్ తెలిపింది. ముఖ్యంగా చాలామంది అయితే హల్దీ ఫంక్షన్ తో పాటు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారని ఆమె తెలిపింది. అద్దెకిచ్చిన కోచ్ లోకి ఇతర ప్రయాణికులు అస్సలు రారని ఆమె తెలిపింది.
ఈ వీడియోలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ తెలిపిన వివరాల ప్రకారం.. అద్దెకిచ్చిన మెట్రో కోచ్ లో ప్రైవేట్ ఫంక్షన్స్ కూడా జరుపుకోవచ్చట. అలాగే ఇందులో ప్రత్యేకమైన షూటింగ్స్ తోపాటు రీల్స్ కూడా చేసుకోవచ్చని "ఇన్ఫ్లుయెన్సర్ దివ్యత ఉపాధ్యాయ్ అర్షిణ శాస్త్ర" తెలిపింది. ఈ అద్దెకు సంబంధించిన మెట్రో మనం స్పెండ్ చేసే టైం ని బట్టి డబ్బులు ఛార్జ్ చేస్తున్నారని ఆమె అన్నారు. ఇష్టమైన ప్రతి ఒక్కరికి మెట్రో కోచ్ అద్దెకి తీసుకోవచ్చని తెలిపారు. ఈమె ఇటీవల పోస్ట్ చేసిన వీడియో మూడు మిలియన్లకు పైగా నేటిజన్స్ వీక్షించారు. అంతేకాకుండా చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్స్ కూడా చేస్తున్నారు..
ఉత్తరప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ (UPMRC) చేపట్టిన కార్యక్రమంలో భాగంగా అద్దె కోచులు లభిస్తున్నాయని వెల్లడించింది. కుటుంబంతో కలిసి ఎలాంటి ఫంక్షన్స్ అయిన ఈ ప్రైవేట్ కోచులు జరుపుకోవచ్చని తెలిపింది. అతి తక్కువ ధరలోనే ఈ కోచ్ ను బుకింగ్ చేసుకోవచ్చని వెల్లడించింది. అలాగే ఏదైనా శుభకార్యాలు ఇందులో జరుపుకోవాలని పది రోజులు ముందుగానే బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని UPMRC తెలిపింది.. అలాగే ఈ బుకింగ్ పై ప్రత్యేకమైన ఆఫర్స్ ను కూడా ప్రకటించింది.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook








