Haryana University Student girl friend in suitcase video: ఇటీవల కాలంలో కొంత మంది యువతీ, యువకులు మాత్రం పూర్తిగా హద్దుదాటిపోయారని చెప్పుకొవచ్చు. పబ్లిక్ గానే ఏమాత్రం మోహమాటం పడకుండా ఇష్టమున్న పనులు చేస్తున్నారు. మరి కొందరు సీక్రెట్ గా యవ్వారాలు నడిపిస్తున్నారు. బైక్ లు, మెట్రోలల్లో రొమాన్స్ చేసుకుంటున్నారు. ఒకప్పుడు ప్రేమ అంటే ఒకరకమైన ఎమోషన్ తో ఉండేవారు. కానీ ఇప్పుడు కొంత మంది తమ అవసరాలకు ప్రేమ అనే ట్యాగ్ పెట్టుకుని అడ్డమైన బూతు పనులు చేస్తున్నారు.
అవసరాలు తీరిపోయాక.. ఎవరికి వారు బ్రేకప్ అంటూ మోహాలు చాటేస్తున్నారు. ఇటీవల కొంత మంది యువకులు లేడీస్ హస్టల్ లోకి అక్రమంగా ప్రవేశించిన ఘటనలు ఉన్నాయి. అయితే.. ఇక్కడ మాత్రం ఒక యువకుడు ఏకంగా ఒక పెద్ద సూట్ కేసులో తన ప్రియురాలిని పెట్టుకుని తన యూనీవర్సీటీ హస్టల్ కు వెళ్లాడు. అప్పుడు అతనికి బిగ్ షాక్ ఎదురైంది.
A boy tried sneaking his girlfriend into a boy's hostel in a suitcase.
Gets caught.
Location: OP Jindal University pic.twitter.com/Iyo6UPopfg
— Squint Neon (@TheSquind) April 12, 2025
హర్యానాలోని సోనిపట్‌లోని ప్రముఖ విశ్వవిద్యాలయంలో వింత ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది. ఒక స్టూడెంట్.. పెద్ద బ్యాగ్ తో హస్టల్ వద్దకు వచ్చాడు . అతను దాన్ని తీసుకెళ్లేందుకు చాలా కష్టపడుతున్నాడు. ఇంతలో అక్కడున్న సిబ్బంది హెల్ప్ చేస్తామంటూ మాత్రం.. అతను ఒప్పుకోలేదు. దీంతో వాళ్లకు సమ్ థింగ్ ఇజ్ ఫిషీ.. అన్న డౌటానుమానం వచ్చింది. వెంటనే ఆ సూట్ కేసును ఓపెన్ చేసి చూశారు.
అప్పుడు ఒక్కసారిగా భద్రత సిబ్బంది, అక్కడున్న వారు ఖంగుతిన్నారు. పెద్ద బ్యాగ్ లోపల ఒక యువతి ముడుచుకుని కూర్చుని ఉంది. దీంతో ఆ యువకుడు సిగ్గుతో తలదించుకున్నాడు. మరీ ఆమె అదే యూనీవర్సీటీలో చదువుకుంటుందా..లేదా అతగాడి ప్రియురాలో తెలీదు కానీ మొత్తంగా ఈ ఘటనను అక్కడున్న వారు కొంత మంది తమఫోన్ లలో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అది కాస్త వైరల్గా మారింది.
. దీనిపై నెటిజన్లు తమదైన స్టైల్ లో కామెంట్లు చేస్తున్నారు. తన ప్రియురాలితో ఏకాంతంగా ఉండాలని ప్లాన్ చేశాడేమో అంటూ కొంత మంది అతనికి సపోర్ట్ చేస్తున్నారు. మరికొందరు ఏందీ భయ్యా.. హస్టల్ లో వేరే బాయ్స్ కూడా ఉంటారు కదా.. బైట కలుసుకొవచ్చు కదా.. అని ఉచిత సలహాలు ఇస్తున్నారు. మొత్తంగా ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









