)
Emotional Mother Incident: నవమాసాలు మోసి.. నరక వేదన అనుభవించి పిల్లలకు జన్మనిచ్చింది. వచ్చీ రాని మాటలతో 'అమ్మా' అని పిలిచినప్పుడు సంబరపడింది. పిల్లలకు కష్టమొచ్చినప్పుడు తల్లడిల్లిపోయింది. రెక్కల కష్టంతో వారిని పెంచి పెద్ద చేసింది. అలాంటి 'అమ్మ' వృద్ధురాలిగా మారడంతో పిల్లలకు భారమైంది. వయోభారంతో ఉన్న అమ్మ ఇప్పుడు భారంగా మారింది. తల్లిని పోషించలేక కుటుంబసభ్యులు రోడ్డుపై వదిలి వెళ్లిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఏపీలో పెనుగంచిప్రోలులో చోటుచేసుకుంది.
పెనుగంచిప్రోలు పట్టణ శివారులోని లింగగూడెం వెళ్లే రోడ్డులోని బస్టాండ్‌లో నాలుగు రోజులుగా 80 ఏళ్లు పైబడిన వృద్ధురాలి ఉంటోంది. ఎనిమిది పదుల వయసులో చల్లటి చలికి వణుకుతూ అక్కడే నివసిస్తోంది. దారిన పోయేవాళ్లు సహాయం చేస్తే తిని అక్కడే ఉంటోంది. ఆమె వివరాలు తెలుసుకునేందుకు జీ తెలుగు న్యూస్ ప్రయత్నం చేయగా షాకింగ్ విషయాలు తెలిశాయి. తన పేరు పద్మ అని.. ఊరు పెనుగంచిప్రోలు అని చెబుతున్న ఆమెకు కళ్లు కనిపించవు.
తనకు ముగ్గురు పిల్లలు అని చెప్పి.. వారందరికీ పెళ్లిళ్లు చేసింది. వారందరూ జీవితంలో నిలబడేలా చేసిన ఆమె ఇప్పుడు ఒంటరిగా రోడ్డుపై పడి ఉంది. అయితే ఆమెకు ముగ్గురు కుమార్తెలు ఉండగా వారందరికీ పెళ్లి చేయడంతో అత్తగారింట్లో ఉంటున్నారు. ఈ సమయంలో ఆమెను పోషించేవారు లేకపోయారు. కొన్నాళ్లు ఆమెను పోషించిన మనవడు ఆర్థిక పరిస్థితులు.. లేదా మరే కారణమ తెలియదు కానీ పండు ముదుసలిని రోడ్డుపై వదిలివెళ్లారు.
ఎండలో ఎండుతూ... చలికి వణుకుతూ.. ఆ వృద్ధురాలు ఆకలితో అలమటిస్తోంది. బస్టాపులో వృద్ధురాలిని చూస్తూ స్థానికులు అటువైపు వెళ్తుండగా ఆమెకు సహాయం చేస్తున్నారు. ఎవరైనా ఏమైనా పెడితే తినడం... లేదంటే పస్తులుంటున్నానని ఆ అమ్మ చెప్పి కన్నీటి పర్యంతమైంది. ఇంత చల్లటి చలిలో వృద్ధురాలిని మానవత్వం లేకుండా వదిలేసిన కుటుంబసభ్యులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు స్పందించి ఆమెను చేరదీయాలని స్థానికులు కోరుతున్నారు. మరి ఆమె పరిస్థితి చూసి స్వచ్ఛంద సంస్థలు చూసి స్పందిస్తారో లేదా.. ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? అనేది వేచి చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook