)
Cobra In Air Cooler Video Watch: పది రోజుల క్రితం వానలు విస్తారంగా కురిసాయి. దీని కారణంగా నగరాల్లోని వివిధ ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయిన విషయం మనందరికీ తెలుసు. అయితే అడవుల్లో కూడా భారీగా వర్షం కురవడంతో జంతువులతో పాటు పాములు సురక్షితమైన ప్రదేశాలను వెతుక్కోవడానికి జనావాసాల్లో సంచారం చేయడం ప్రారంభించాయి. ముఖ్యంగా ఆహార కోరత కారణంగా కొన్ని జంతువులు జనావాసాల్లో తిరగడం ప్రారంభిస్తే.. వర్షం కారణంగా కూడా కొన్ని రకాల జంతువులు అడవిలో నుంచి బయటికి వస్తున్నాయి. పాముల గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. వర్షాకాల సమయంలో ఇవి ఎక్కువగా రాత్రిపూట ఇళ్లలోకి సంచారం చేస్తూ ఉంటాయి. కాబట్టి అడవి పరివాహక ప్రాంతాల్లో నివసించేవారు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రా ఇంట్లో ఉండే పనికిరాని ఎయిర్ కూలర్‌లోకి సంచారం చేసింది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోనే వైరల్‌గా మారింది.
చాలామంది వర్షాల కారణంగా వాతావరణం చల్లబడడం వల్ల ఇంట్లో లభించే ఎయిర్ కూలర్స్ వాడకం చాలావరకు తగ్గిస్తూ ఉంటారు. ముఖ్యంగా వర్షాకాలంలో ఫ్యాన్లతో పాటు కూలర్స్‌ను పక్కన పడేస్తూ ఉంటారు. అయితే, అడవికి దగ్గరగా జీవించే చాలామంది వీటిని ఇంట్లో కంటే ఎక్కువగా బయట పెడుతూ ఉంటారు. ఈ వీడియో చూస్తే ఇకనుంచి అస్సలు బయటపెట్టారు. ఎందుకంటే ఇటీవల వైరల్ అవుతున్నావు వీడియోలో అత్యంత ప్రమాదకరమైన నాగుపాము కూలర్లో సంచారం చేసి అటు ఇటు చూస్తున్న దృశ్యాలు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
మొదటగా ఆ కుటుంబ సభ్యులు పామును కూలర్ లో చూసి ఆందోళన చెందాయి. అయితే, వారు వెంటనే ఆటవిశాఖ అధికారులతో పాటు స్నేక్ క్యాచర్స్ కి సమాచారం అందించారు. వెంటనే వార అక్కడికి చేరుకొని.. ఆ పామును రెస్క్యూ చేశారు. ఇక వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళ్తే.. ఓ అత్యంత ప్రమాదకరమైన నాగుపాము కూలర్లో ఉండే ఫ్యాన్ భాగంలో చుట్టుకొని బయటికి చూస్తూ ఉండడం మీరు గమనించవచ్చు. ఆ పాము ఏమాత్రం భయపడకుండా దాని శరీరాన్ని కూలర్ లోపల ఉంచి తలభాగాన్ని మాత్రం అవతల వైపుకు పెట్టి అటు ఇటు చూడడం మీరు గమనించవచ్చు.. దీనికి సంబంధించిన వీడియోను ఓ ఇంటి యజమాని తన మొబైల్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారింది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి