Hissing Snake Viral Video Watch: పాములు ప్రత్యేకంగా కాళ్లలను కలిగి లేకపోయిన వాటి కదలికలు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. పాములు తమ శరీరాన్ని నేలపై వంపుకుని కండరాలను సంకోచిస్తూ.. అటు ఇటు తిప్పుతూ ముందుకు సాగుతూ ఉంటాయి. కొన్ని జాతులకు సంబంధించిన పాములైతే చాలా వేగంగా కదులుతూ చెట్లు ఎక్కుతూ ఉంటాయి. అలాగే పాములన్నీ వాటి నాలుకలను బయటి చాచి గాల్లోని పలు రకాల రసాయనాలను గ్రహిస్తూ ఉంటాయి. ఇలా గాళ్లో నుంచి గ్రహించిన రసాయం ఆహారం ఎక్కడ ఉంది? అలాగే శత్రువులు దగ్గర్లోనే ఉన్నారా? అనే సమాచాన్ని పాముకు అందిస్తుంది. అందుకే పాములు ఎక్కుగా వాటి నాలుకలను బయటికి చాచి ఉంచుతూ ఉంటాయి.
ప్రపంచంలో అనేక రకాల పాములు ఉంటాయి. ఇందులోని చాలా పాములు వింతగా కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి పాములు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి. కొన్ని వింత పాములకు సంబంధించిన విషం చాలా ప్రమాదకరమని అందరికీ తెలుసు.. అయితే మరికొన్ని పాములు మాత్రం వింతగా కనిపించినప్పటికీ విషపూరితమైనవి కావు.. ఇలాంటి పాములు తరచుగా చిత్తడి నెలల్లో కనిపిస్తూ ఉంటాయి. తాజాగా సోషల్ మీడియాలో ఓ వింత పాముకు సంబంధంచిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
ఈ వీడియో వివరాల్లోకి వెళితే.. కొంతమంది ఇద్దరు అనుకోకుండా చిత్తడి నెలల్లో నడుచుకుంటూ వెళ్తున్న సంద్భరంలో ఒక యువకుడికి ఓ అరుదైన పాము కనిపిస్తుంది. అయితే ఆ పాము ప్రమాదకరమైనది కాకపోవడంతో వారు దానిని పట్టుకుని.. కెమెరాకు చూపించారు. అయితే వారు చూపిస్తున్న పాము అన్ని పాముల కంటే చాలా భిన్నంగా ఉంది. చూడడానికి చిన్నదిగా ఓ అరుదైన జాతికి సంబంధించిన పాముగా ఉండడం మీరు చూడొచ్చు.
ఈ వీడియోను @WillRobertsonsWildlife అనే యూట్యుబ్ ఛానెల్ నుంచి పోస్ట్ చేశారు. అయితే దీనిని హిస్సింగ్ స్నేక్ అనే పేరు పెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పటి వరకు కొన్ని లక్షల మంది సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించారు. అంతేకాకుండా 12 వేల మంది నెటిజన్స్ లైక్ చేశారు. అలాగే ఈ అరదైన పామును చూసి నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది ఈ పాములు చాలా వింతగా ఉందని కామెంట్స్ రాస్తున్నారు.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









