Viral Video: సింహం అయితే మాకేంటీ.. ఏకంగా మృగరాజు శరీరంపైనే తేనెపట్టు కట్టిన తేనెటీగలు.. వీడియో వైరల్..

Lion Video: అడవికి రాజైన సింహనికి తేనెటీగలు చుక్కలు చూపించాయి. దాని ఒంటి నిండా పాకిపోయి జూలు మీదనే తేనె పట్టును పెట్టేశాయి. పాపం సింహం మాత్రం తేనెటీగల్ని వదిలించుకోలేక తెగ ఇబ్బందులు పడింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Mar 4, 2025, 02:46 PM IST
  • సింహనికి షాక్ ఇచ్చిన తేనెటీగలు..
  • వీడియో చూసి విస్తుపోతున్న నెటిజన్లు..
Viral Video: సింహం అయితే మాకేంటీ.. ఏకంగా మృగరాజు శరీరంపైనే తేనెపట్టు కట్టిన తేనెటీగలు.. వీడియో వైరల్..

Honey bees made their hive on lion body video: సింహన్ని అడవికి రాజుగా చెప్తుంటారు. అడవిలోని జంతువులన్నింటికి సింహం అంటే హడల్. పొరపాటున కూడా సింహం కళ్లలోకి ఏదైన జంతువు పడిందంటే అవి ఆహరం కావాల్సిందే. పెద్ద పెద్ద ఏనుగులు, బలమైన జిరాఫీలు, అడవి దున్నలు సైతం సింహలను చూసి దూరంగా పారిపోతుంటాయి. అయితే.. అలాంటి సింహలకు ఇక్కడ తేనెటీగల గుంపు చుక్కలు చూపించింది.

Add Zee News as a Preferred Source

 

ఒక సింహన్ని తేనెటీగలు చుట్టుముట్టాయి. సాధారణంగా తేనెటీగలు అడవిలో చెట్ల కొమ్మలకు లేదా ఇళ్లలోని గోడల వద్ద, సజ్జల మీద తేనెపట్టులు కడుతుంటాయి. ఇదంతా మనకు తెలిసిందే. కానీ ఇక్కడ మాత్రం సింహలు ఏకంగా సింహం శరీరం మీద ఉన్న జూలుపై తమ తేనెపట్టును కట్టాయి. దీంతో సింహం ఎటు కదల్లేక తెగ ఇబ్బందులు పడింది.  అంతే కాకుండా.. సింహం ఎటు పోతే అటు తేనెటీగల గుంపులు, వాటి మీద ఉండి.. జూలును వదలకుండా.. తమ తేనెపట్టుని పెట్టాయి.

మొత్తంగా తేనెటీగల గుంపు సింహం మీద వాలుతూ, సింహనికి చుక్కలు చూపించాయి.  చాలా సార్లు సింహం కూడా తేనెటీగల సంచారంతో కూడా ఎటు కదల్లేక, వేట చేయడంలో కూడా ఇబ్బందులు పడినట్లు కన్పిస్తుంది. అయితే.. దీన్ని కొంత మందిసఫారీలో జంతు ప్రేమికులు గమనించారు. సింహనికి మత్తు మందు ఇచ్చి.. ఆ తర్వాత దాని జూలు మీద ఉన్న తేనెపట్టును తొలగించారు.

Read more: PM Modi in Vantara Video: వంతారాలో సింహం, పులి పిల్లల్ని ఆడిస్తున్న ప్రధాని మోదీ.. వీడియో వైరల్..

ఈ క్రమంలో సింహం శరీరం మీద ఉన్న జూలును అంతటిని తొలగించి, తేనెతట్టును కూడా తీసేశారు. ఆ తర్వాత సింహంను అడవిలో వదిలేశారు.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అడవికి రాజైన సింహనికే తేనెటీగలు చుక్కలు చూపించాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
 

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News