Viral Video: ఛీఛీ.. వీళ్లు మనుషులేనా.?.. గుర్రం నోట్లో సిగరెట్లు పెట్టి, దాని మీద పుష్ అప్స్.. వీడియో వైరల్..

Horse video: గుర్రంమీద బలవంతంగా కూర్చుని దాని నోట్లో సిగరెట్ పెట్టాడు. అంతే కాకుండా.. దానిమీద పడుకుని పుష్ అప్ లు చేశాడు.ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆవేశంతో మండిపోతున్నారు.  అతనిపై చర్యలు తీసుకొవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Mar 4, 2025, 07:00 PM IST
  • గుర్రంపట్లు క్రూరంగా ప్రవర్తన..
  • ఆగ్రహాం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు..
Viral Video: ఛీఛీ.. వీళ్లు మనుషులేనా.?.. గుర్రం నోట్లో సిగరెట్లు పెట్టి, దాని మీద పుష్ అప్స్.. వీడియో వైరల్..

Horse forced to smoke cigarette video viral: సాధారణంగా చాలా మంది మూగ జీవాలను ఎంతో ఇష్టంతో తమ ఇళ్లలో పెంచుకుంటారు. కుక్కలు, పిల్లులు, రామ చిలుకలు మొదలైన జంతువులను ఇటీవల పెంచుకుంటున్నారు. చాలా మంది వాటిని తమ ఇంట్లో మనుషుల్లాగానే ట్రీట్ చేస్తారు. వాటికి మంచి ఫుడ్ పెడుతారు. వెటర్నరీ ఆస్పత్రికి తీసుకొని వెళ్తుంటారు.

Add Zee News as a Preferred Source

మూగ జీవాలు సైతం తమ యజమానుల పట్ల అంతే ప్రేమతో ఉంటాయి. తమ ఓనర్స్ చుట్టు తిరుగుతుంటాయి.  తమ ఓనర్స్ కన్పించకుంటే.. కనీసం ఆహారం సైతం ముట్టుకొవు. మరోవైపు మూగ జీవాల పట్ల అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తుంటారు. మూగ జీవాలను కొడుతూ, వాటిని హింసిస్తుంటారు. 

 

 అయితే.. చాలా మంది  తమ పెళ్లిళ్లకు గుర్రాలను బారాత్ లలో తెచ్చుకుంటారు. గుర్రం మీద పెళ్లి మండపానికి వెళ్లే సాంప్రదాయం చాలా మంది పాటిస్తారు. ఇలాంటి సందర్బాలలో గుర్రాలను పెంచే వాళ్లు.. వాటిని తీసుకుని పెళ్లి జరిగే చోటకు వెళ్లుంటారు. పెళ్లిలో గుర్రాలను డ్యాన్స్ చేస్తుంటారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఒక గుర్రం పట్ల కొంత మంది ప్రవర్తించిన తీరు సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహానికి కారణమైంది.  

వివాహా వేడుకలో..కొంత మంది  గుర్రంను కొంత మంది బలవంతంగా కింద పడుకొబెట్టారు. దాని నోట్లో సిగరేట్ ఉంచి దానిలో పీల్చేలా చేశాడు. అంతటితో ఆగకుండా దాని మీద పడుకుని పుష్ అప్స్ కూడా చేశారు. దీన్ని వీడియో కూడా తీసుకున్నాడు. కొంతమంది అక్కడున్న వాళ్లు దీన్ని వీడియో తీశారు.

Read more: Viral Video: సింహం అయితే మాకేంటీ.. ఏకంగా మృగరాజు శరీరంపైనే తేనెపట్టు కట్టిన తేనెటీగలు.. వీడియో వైరల్..

సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది కాస్త వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు.  ఈ ఘటన ఎక్కడ జరిగిందొ కానీ.. సదరు వ్యక్తుల్ని అత్యంత కఠినంగా పనిష్మెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అదే గుర్రం కాళ్ల కింద వాడిని పడుకొబెట్టి తొక్కించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News