)
King Cobra Catching Viral Video Watch: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ స్నేక్యాచార్ అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రాను పట్టుకోవడానికి చేసిన సాహసానికి సంబంధించిన వీడియోనే వైరల్‌గా మారింది. సాధారణంగా మనం సోషల్ మీడియాలో ఎన్నో రకాల స్నేక్ వీడియోస్ చూస్తూ ఉంటాం.. కానీ ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో వాటన్నిటికంటే చాలా భిన్నమైంది. ఈ వీడియోలో ఓ స్నేక్ క్యాచర్ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అత్యంత పెద్ద కింగ్ కోబ్రాను పట్టుకునేందుకు ప్రయత్నించాడు.. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన వీడియోనే వైరల్‌గా మారింది. ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ..
వీడియో వివరాల్లోకి వెళితే ఓ పాము ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తోంది. అయితే, వెంటనే అక్కడున్న స్నేక్ క్యాచర్ అక్కడికి చేరుకొని ఆ పామును పట్టుకునే ప్రయత్నమే ఈ వీడియో.. వీడియోలో ఓ స్నేక్ క్యాచర్ ఇంట్లోకి వెళ్తున్న పాము తోకను పట్టుకొని బయటికి లాగడం మీరు గమనించవచ్చు. అతను ఆ తోక పట్టుకోగానే పాము ఆగ్రహానికి గురై తనపై దాడి చేసే ప్రయత్నం కూడా చేసింది. ఇలా ఆ పామును అతడు మూడుసార్లు పట్టుకోవడం మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఈ మూడు సందర్భాల్లో అతనిపై దాడి చేసే ప్రయత్నం చేయడం మీరు గమనించవచ్చు. అయితే ఈ ఘటనను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు..
చివరిగా అతను ఆ పాము తోకను పట్టుకొని కొద్దిసేపు అలాగే ఉండిపోయాడు. ఈ సమయంలో కూడా దాడి చేసే ప్రయత్నం చేసింది. చివరకు ఆ పాము అతని చేతిలో నుంచి జారిపోయి.. కింద పాకుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేయడం మీరు వీడియోలో క్లియర్‌గా చూడొచ్చు. వెంటనే పారిపోతున్న సందర్భంలో ఆయన ఆ పాముని పట్టుకొని మళ్లీ వెనక్కి తీసుకువచ్చాడు. ఇలా చివరకు ఆ పామును రెస్క్యూ చేసి అడవి ప్రాంతంలో వదిలేసినట్లు సమాచారం. ఇప్పుడు ఈ దృశ్యం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ వీడియోను MIRZA MD ARIF" అనే టైటిల్ పెట్టి యూట్యూబ్ నుంచి షేర్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను కొన్ని వేల మందికి పైగా వీక్షించారు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి