)
Huge King Cobra Video Watch: సాధారణంగా పాములు అత్యంత ప్రమాదకరమని మనందరికీ తెలుసు. చాలామంది వీటి దగ్గరికి కూడా వెళ్లేందుకు అంతగా ఇష్టపడరు. కానీ కొంతమంది మాత్రం వీటిని పట్టుకొని రక్షించడంలో ముందుంటున్నారు. ఇలాంటి సమయాల్లోనే వీడియోలుగా చిత్రీకరించి పోస్ట్ చేస్తున్న వీడియోలు ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనివల్ల పాములకు సంబంధించిన ఎలాంటి వీడియోలు పోస్ట్ చేసిన సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతూ వస్తున్నాయి. ఇలా నిత్యం పాములకు సంబంధించిన ఎన్నో రకాల వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా కూడా ఓ విషపూరితమైన పాముకు సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది.
సాధారణంగా పల్లె ప్రాంతాల్లో వ్యవసాయం చేసే రైతులకు పాములు ఎక్కడ ఉంటాయనేది తప్పకుండా తెలుస్తుంది. అప్పుడప్పుడు పాములు వ్యవసాయ క్షేత్రాల్లో కూడా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా పాడి పరిశ్రమలు ఉన్నవారు తరచుగా పాములను చూస్తూ ఉంటారు. ఎందుకంటే పాల వాసన కలిగిన ప్రాంతాలకు పాములు ఎంతో సులభంగా వస్తాయి. ఇందులో భాగంగానే కొన్ని పాములు పశువులను పెంచే చోటికి వస్తూ ఉంటాయి. తాజాగా కూడా ఓ పాము ఇలాగే వచ్చింది. దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు ఇంటర్నెట్లో ఊహించని స్థాయిలో వైరల్ అవుతున్నాయి..
వీడియో వివరాల్లోకి వెళ్తే.. ఓ అత్యంత విషపూరితమైన పాము.. పశువులను పెంచుతున్న చోటికి సంచారం చేయడం చూడొచ్చు. ఇది సమయంలో అక్కడ కొన్ని ఆవులతో పాటు దూడలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అయితే, ఆ పాము నేరుగా ఒక ఆవు దగ్గరికి వెళ్తుంది. ఆ ఆవు దగ్గరికి వెళ్లి.. దాని పొదుగు నోటితో పట్టుకొని పాలు తాగడం చూడొచ్చు. ఈ ఆశ్చర్యం కలిగించే ఘటన ఇప్పుడు విపరీతంగా వైరల్‌గా మారింది. సాధారణంగా కొన్ని పాములు ఆవులని చూస్తేనే వాటిపై దాడి చేస్తూ ఉంటాయి.. అలాంటిది ఈ విషపూరితమైన పాము ఆవు దగ్గరికి వెళ్లి.. ఏకంగా నోటితో పాలు తాగింది.
పాము పాలు తాగుతున్న దృశ్యాలు ఓ Cc కెమెరాలో రికార్డ్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ దృశ్యాలను అక్కడున్న రైతులు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు సమాచారం. అయితే, ఈ వీడియో చూసిన చాలా మంది.. ఇది ఒరిజినల్ వీడియో కాదని.. ఎవరు కావాలని Ai ద్వారా సృష్టించి పోస్ట్ చేశారని సోషల్ మీడియా వినియోగదారులు తెలుపుతున్నారు. ఈ వైరల్ అవుతున్న షార్ట్ వీడియో శమరిక వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు. ఇప్పటివరకు వీడియోను కొన్ని వేల మందికి పైగా వీక్షించినట్లు సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook