King Cobra Video: ఈత కల్లు తాగుతున్న భారీ కింగ్‌ కోబ్రా..ఈ రేర్‌ వీడియో మీ కోసమే..

Huge King Cobra Drinking Palm Wine Video Watch: ఈత చెట్టుపై పాముకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్స్‌ పాములు ఇలా కూడా చేస్తాయా అని ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 5, 2025, 07:40 AM IST
King Cobra Video: ఈత కల్లు తాగుతున్న భారీ కింగ్‌ కోబ్రా..ఈ రేర్‌ వీడియో మీ కోసమే..

Huge King Cobra Drinking Palm Wine Video Watch: భూమిపై అత్యంత పురాతనమైన విషపూరితమైన జీవుల్లో పాములు కూడా ఒకటి.. దాదాపు కొన్ని జాతుల పాములు 150 మిలియన్‌ సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూ వస్తున్నాయి. ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లో పాములు నివసిస్తూ ఉంటాయి. ఏడారుల్లో ఏడారి జాతులకు సంబంధించిన పాములు జీవిస్తే.. అత్యధికగా నీరు కలిగిన ప్రాంతాల్లో నీటీ జాతులకు సంబంధించిన పాములు నివసిస్తూ ఉంటాయి. ఇలా భూమిపై వివిధ రకాల జాతుల పాములు నివసిస్తూ ఉంటాయి.

Add Zee News as a Preferred Source

జాతులను బట్టి పాముల ఆకారాలు కూడా మారుతూ ఉంటాయి. ఇందులో కొన్ని పాములు చాలా పొడవుగా ఉంటే.. మరికొన్ని పాములు చాలా పొట్టిగా ఉంటాయి. కొన్ని పాముల శరీరం చాలా వింతగా ఉంటుంది. వాటి చర్మాని ఎకువగా పొలుసు ఉండడం మీరు గమనించవచ్చు. పాములు వాటి జీవితంలో చర్మాన్ని అనేక సార్లు విడిచి పెడుతూ ఉంటాయి. దీనినే మనం అంతా పాము కుబుసం విడవడం అని చెప్పుకుంటూ ఉంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన వీడియోలు విచ్చలవిడిగా వైరల్‌ అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని పాములు ఆహారం లేక జనావాసాల్లోకి వచ్చి సంచారం చేస్తున్న సమయంలో చిత్రీకరించే వీడియోలు మనం ఎప్పుడు సోషల్‌ మీడియాలో చూసి ఉంటాం..తాజాగా ఇలాంటి జనావాసాల్లోకి సంచారం చేస్తున్న పాముకు సంబంధించిన వీడియోనే తెగ వైరల్‌ అవుతూ వస్తోంది. 

పాములు సులభంగా పాకుతూ చెట్లు ఎక్కుతూ ఉంటాయి. చెట్లపై వాటికి కావాల్సిన ఆహారం ఏదైనా ఉంటే తప్పకుండా వాటిపై దాడి చేసి మరీ తింటూ ఉంటాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఈత చెట్టుపై కింగ్‌ కోబ్రా చుట్టుకుని ఉండడం చూడొచ్చు. అలాగే ఆ కింగ్‌ కోబ్రా చెట్టుకు ఉన్న కుండలో చుట్టుకుని బుసలు కొట్టడం మీరు గమనించవచ్చు. అంతేకాకుండా ఆ చెట్టు నుంచి వస్తున్న కల్లు (Palm wine)ను పాము తన నాలుకతో నాకడం మీరు గమనించవచ్చు. ప్రస్తుతం దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది.

ప్రస్తుతం వైరల్‌ అవుతున్న వీడియోను @shatrudhanbabasharpmitra.9733 అనే యూట్యుబ్‌ ఛానెల్‌ నుంచి పోస్ట్‌ చేశారు. ఇప్పటి వరకు దీనిని 389 మంది సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా చాలా మంది ఈ వీడియోను చూసిన నెటిజన్స్‌ హర్‌ హర్‌ మహాదేవ్‌ అంటూ కామెంట్స్‌ కూడా చేస్తున్నారు. ఇలాంటి పాములకు సంబంధించిన సన్నివేశాలు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. 

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News