Huge 10 Feets King Cobra Video Watch Here: ప్రపంచంలో ఎన్నో జాతులకు సంబంధించిన పాములు ఉంటాయని అందరికీ తెలిసిందే.. కానీ అందులో ప్రమాదకరమైన జాతులకు సంబంధించిన పాములు కొన్నే ఉంటాయి. అందులో కింగ్ కోబ్రా జాతి ఒకటి. ఇది చూడడానికి భారీ ఆకారాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఎప్పుడూ ఆగ్రహంతో బుసలు కొడుతూనే ఉంటుంది. అలాగే ఇది ప్రదేశాన్ని బట్టి విభిన్న రంగులను కలిగి ఉంటుంది. ఎక్కువగా కింగ్ కోబ్రాలు అమెజాన్ అడవులతో పాటు ఆఫ్రికా కు సంబంధించిన కొన్ని అడవుల్లో జీవిస్తూ ఉంటాయి. ఇవి ఎంతో ఆకలిని కలిగి ఉంటాయి.. కాబట్టి వాటి ఆకలిని తీర్చుకోవడానికి ఎంత పెద్ద జంతువులనైన వేటాడేందుకు ఇష్టపడతాయట. అందుకే చాలామంది వీటిని చూసిన వెంటనే పది అడుగుల దూరం పరిగెడుతూ ఉంటారు..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం భారతదేశంలోని పలు అటవీ సరిహద్దు ప్రాంతాల్లో ఉండే కొన్ని గ్రామాల్లో కూడా తరచుగా కిందికోబ్రాలు సంచారం చేస్తూ ప్రజలను ఆందోళన కలిగిస్తున్నాయి. కానీ చాలా గ్రామాల్లో కింగ్ కోబ్రాల జాతి అంతరించకుండా వాటిని పట్టుకొని సురక్షితమైన ప్రాంతాలకు తరలించి ఆశ్రయము కల్పిస్తున్నారు. ఇందులో స్నేక్ క్యాచర్ కీలక పాత్ర పోషిస్తున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే చాలామంది పాముకాటుకు గురై మరణిస్తున్నారు. అయితే కొంతమంది స్నేక్ క్యాచర్స్ వాళ్లు పడుతున్న కష్టాన్ని వీడియో రూపంలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇలా పాములు పట్టే వీడియోలే సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. 



ఇలా సోషల్ మీడియాలో షేర్ చేసే వీడియోలో ప్రముఖ స్నేక్ క్యాచర్ ఆకాష్ జాదవ్ వీడియోలే ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి. ఇటీవల ఆయన సోషల్ మీడియాలోకి షేర్ చేసిన వీడియో ప్రస్తుతం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.  ఇటీవల ఓ అడవి సరిహద్దు ప్రాంతంలోకి భారీ కింగ్ కోబ్రా సంచారం చేస్తూ ఉంటుంది. అయితే ఇదే సమయంలో అక్కడే ఉండే గ్రామస్తులు దీనిని గమనించి.. స్నేక్ క్యాచర్కు ఇన్ఫర్మేషన్ అందించారు. దీంతో వారి బృందం అక్కడికి చేరుకొని పాము కోసం దాదాపు రెండు గంటల పాటు గాలింపు చర్యలు చేపట్టారు. ఇలా గాలింపు చర్యల్లో భాగంగా పాము ఓ పాడుబడ్డ గుడిసెలోకి వెళ్లడం గమనించిన కొందరు స్థానికులు స్నేక్ క్యాచర్కు ఇన్ఫర్మేషన్ అందించారు. దీంతో ఆ బృందం అక్కడికి చేరుకొని ఆ గుడిసెలో వెతికెందుకు ప్రయత్నించారు. ఇలా వెతికే క్రమంలో అక్కడే ఉండే కట్టెల కింద పాము ఉండడం గమనిస్తారు. 


ఆ పాడుబడ్డ గుడిసెలో నుంచి పామును బయటికి తెచ్చేందుకు శతవిధాలుగా స్నేక్ క్యాచర్స్ ప్రయత్నిస్తారు. కొన్ని గంటలసేపు ఇలా ప్రయత్నించి పామును పట్టుకొని సురక్షితంగా బయటికి తీసుకువస్తారు. ఇంత పెద్ద పాపను చూసిన ఆ స్థానికులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతారు. స్నేక్ క్యాచర్ ఆకాష్ జాదవ్ ఆ పామును పట్టి పైనకు ఎత్తి చూపే ప్రయత్నం కూడా చేస్తాడు. అయితే ఈ సమయంలో ఆ 10 అడుగుల పాము అతన్ని కాటేసేందుకు ప్రయత్నిస్తుంది. దీంతో ఆయన కాస్త భయానికి లోనై.. సంచిలో సురక్షితంగా బంధించి అడవి ప్రాంతంలో విడిచిపెడతాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతుంది. 


Also Read: Ram Gopal Verma: నా అరెస్ట్‌పై మీకు ఎందుకు తొందర.. కేసులపై న్యాయ పోరాటం చేస్తా'


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.