Huge snakes in desart video: పాములు వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ గా ఉంటున్నాయి. ముఖ్యంగా వెరైటీ పాముల వీడియోలను చూసేందుకు నెటిజన్లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవల పాములకు చెందని సయ్యాటలకు చెందిన వీడియోలు ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి. అదే విధంగా.. పాములు తమ కుబుసం వదులుతున్న వీడియోలు వార్తలలో ఉంటున్నాయి.
అంతేకాకుండా.. పాములు ఎక్కువగా జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. అస్సలు.. జనాలు కూడా పాములను చూసి భయపడిదూరంగా పారిపోతున్నారు. వెంటనే స్నేక్ క్యాచర్ లకు సమాచారం ఇస్తున్నారు. దీంతో వాళ్లు రంగంలోకి దిగి పెద్ద పెద్ద సర్పాలను బంధిస్తున్నారు. ఇటీవల కింగ్ కోబ్రాలు కూడా సయ్యాట లాడుతున్న ఘటనలను చూసి చాలా మంది భయంతో వణికిపోయారు.
సాధరణ పాములు చూస్తే ఎంతో డెంజర్ గా ఉంటాయి. అలాంటిది కింగ్ కోబ్రా.. దాన్ని చూస్తేనే ప్రాణాలు అట్నుంచీ అటేపోతాయి. అది పొరపాటున కాటు వేస్తే నిముషాల్లో ప్రాణాలు పైకి పోతాయిన చెప్తుంటారు.
ఈ క్రమంలో ప్రస్తుతం ఎడారిలో పాముల గుంపుకు చెందిన ఒక వీడియో నెట్టింట వైరల్గా మారింది. దీనిలో నల్లని కోబ్రా పాములు అవేవో సైన్యంలా ఏర్పడి గుంపులుగా ..మరో రాజ్యం మీద దాడికి వెళ్తున్నట్లు వేగంగా వెళ్తున్నాయి. అది చూసేందుకు కూడా ఎంతో భయంకరంగా ఉంది.
సాధారణంగా ఎడారిలో మనం ఇసుక తుఫానులను చూస్తుంటాం. కానీ ఇది పాముల దండయాత్ర తుపానులా ఉండదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మొత్తంగా ఈ పాముల దండు వీడియో వైరల్గా మారింది. దీన్ని చూస్తే మాత్రం చాలా భయంగా ఉందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.









