Venomous King Cobra Video: 14 అడుగుల భారీ కింగ్‌ కోబ్రా.. ఈ అరుదైన దృశ్యాలు చేస్తే భయపడడం పక్కా..

Venomous King Cobra Video Now: వైల్డ్‌లైఫ్ రెస్క్యూ సొసైటీలకు సంబంధించిన కొంతమంది స్నేక్‌ క్యాచర్స్‌ పోస్ట్ చేసి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 17, 2025, 07:55 AM IST
Venomous King Cobra Video: 14 అడుగుల భారీ కింగ్‌ కోబ్రా.. ఈ అరుదైన దృశ్యాలు చేస్తే భయపడడం పక్కా..

Venomous King Cobra Video Here: వైల్డ్‌లైఫ్ రెస్క్యూ సొసైటీలకు రోజు రోజు ప్రధాన్యత పెరుగుతూ వస్తోంది. అలాగే ఈ సొసైటీల్లో పాములు పట్టేవారికి ప్రత్యేకమైన శిక్షణలను కూడా అందిస్తున్నారు. ప్రత్యేకమైన వైల్డ్‌లైఫ్ రెస్క్యూ సొసైటీలను NGOల ద్వారా రిజిస్టర్డ్ చేసి శిక్షణలు అందిస్తున్నారు. ఇలా మహారాష్ట్రాలోని అహ్మద్‌నగర్‌లో  దాదాపు 13 సంవత్సరాలుగా వైల్డ్‌లైఫ్ రెస్క్యూ సొసైటీలను నడుపుతున్నారు. వన్యప్రాణులను రక్షించుకునేందుకు వీరు 24 గంటలూ పనులు చేయడం విశేషం..ముఖ్యంగా పాములను రక్షించేందుకు చాలా మంది గంటల తరబడి కాపు కాస్తూ వాటిని సురక్షితంగా పట్టుకుని అడవి ప్రాంతాల్లో వదిలేస్తున్నారు. 

Add Zee News as a Preferred Source

కొన్ని వైల్డ్‌లైఫ్ రెస్క్యూ సొసైటీలు పాములు, ఇతర జంతువులు పట్టుకునే క్రమంలో వీడియోలు తీసి కూడా సోషల్ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. దీనికి సంబంధించిన చాలా వీడియోలు వైరల్‌ అవుతూ వస్తున్నాయి. తాజా అహ్మద్‌నగర్‌లోని వైల్డ్‌లైఫ్ రెస్క్యూ సొసైటీ టీమ్‌ వాళ్లు పట్టుకున్న కింగ్‌ కోబ్రాకి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్‌ అవుతూ వస్తోంది. ఇందులో ప్రముఖ స్నేక్‌ క్యాచర్‌ ఆకాష్ జాదవ్‌ పట్టుకున్న ఓ వీడియో విపరీతంగా నెట్టింట్లో వైరల్‌ అవుతోంది.

వైరల్‌ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళితే, ఓ భారీ కింగ్‌ కోబ్రా పాత పాడు పడ్డ ఇంటిలో సంచారం చేయగా.. అయితే అక్కడే ఉన్న స్థానికులు గుర్తించి.. వెంటనే స్నేక్‌ క్యాచర్‌ ఆకాష్‌ జాదవ్‌కి సమాచారం అందిస్తారు. వెంటనే ఆ స్నేక్‌ క్యాచర్‌ కూడా అక్కడికి చేరుకుని, పాములు వెతికే ప్రయత్నం చేస్తాడు. అయితే పాత పగిలిపోయిన గోడలో ఉండడం గమనించిన స్నేక్‌ క్యాచర్‌ దాని తోకను పట్టుకుని లాగుతాడు. ఇంతలోనే ఆ పాము కూడా కిందికి దిగిపోతుంది. దీంతో ఆతడు పామును పట్టుకుని ఖాళీ ప్రదేశానికి తీసుకు వస్తాడు. ఈ సమయంలో స్నేక్‌ క్యాచర్‌పై చాలా సార్లు దాడి చేసే ప్రయత్నం చేస్తుంది. అయినప్పటికీ ఆతడు ఆ పాము కాటు నుంచి తప్పించుకుంటాడు.

చివరికి చాలా సేపు కష్టపడి పామును పట్టేసుకుంటాడు. అయితే దీనికి సంబంధించిన వీడియోను రెండు సంవత్సరాల క్రితం @Sarpmitra Akash Jadhav అనే యూట్యుబ్‌ ఛానెల్‌ నుంచి పోస్ట్‌ చేశారు. దీనిని ఇప్పటి వరకు 19 మిలియన్స్‌కి పైగా సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించారు. అంతేకాకుండా ఇప్పటి వరకు 2,833 మంది కామెంట్స్‌ చేశారు. ఈ వీడియో పోస్ట్‌ చేసి చాలా సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పుడు యూట్యుబ్‌లో ట్రెండ్‌ అవుతోంది. 

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News