Huge Cobra Worship Video Watch: అడవుల్లో ఆహార, నీటి కోరతలు ఏర్పడడం వల్ల చాలా జంతువులు, పాములు జనావాసాల్లోకి సంచారం చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా పెద్ద పెద్ద పాములు సైతం జనాల్లోకి వచ్చి సేద తీరుతున్నాయి.. అయితే చాలామంది వీటిని రక్షించేందుకు వివిధ ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా కొన్ని పెద్ద పెద్ద నాగుపాములు ఇళ్లలోకి సంచారం చేసి తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. మరికొన్ని పాములు దాడి చేసి ప్రాణాలకు హాని కలిగిస్తున్నాయి. అయితే చాలామంది వీటిని రక్షించే క్రమంలో వీడియోలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
నాగుపాములకు సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఓ నాగుపాముకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. శివుడికి కంఠాభరణంగా నాగుపాము ఉంటుంది. దీనిని మన పురాణాల్లో నాగాహారంగా కూడా చెప్పుకుంటూ ఉంటారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో శివలింగం పాముకు సంబంధించిన ఫోటో విపరీతంగా వైరల్ అవుతుంది. పలుచోట్ల శివలింగం చుట్టూ పాములు చుట్టుకుని ఉండడం, అలాగే శివలింగంపై పాము పడగవిపి ఉండడం వంటి సన్నివేశాలు సోషల్ మీడియాలో చూశాం.. కానీ తాజాగా వైరల్ అవుతున్న ఫోటో వీటన్నిటికీ భిన్నంగా ఉంది.
తాజాగా వైరల్ అవుతున్న ఫోటోలు ఓ పాము శివలింగాన్ని పూజిస్తున్నట్టు, ప్రార్థిస్తున్నట్లు కనిపిస్తోంది. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాను విపరీతంగా వైరల్ గా మారింది. దీనిని చూసినా చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు. నాగుపాము శివలింగాన్ని హత్తుకున్న ఘటన నెల్లూరు జిల్లా మనుబోలు చెర్లోపల్లి శ్రీవిశ్వనాథ స్వామి ఆలయంలో జరిగినట్లు అక్కడి స్థానికులు చెబుతున్నారు. అదే గుడిలో ఉండే పుట్టలో పాము శివలింగం దగ్గరికి వచ్చి ఇలా హత్తుకుందని అక్కడి స్థానికులు చెబుతున్నారు. అయితే ఇదే సమయంలో కొంతమంది ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
అంతేకాకుండా ఇలా శివలింగాన్ని హత్తుకున్న 15 నిమిషాలకు తిరిగి ఆలయంలో ఉన్న పుట్టలోకి పాము వెళ్ళిపోయింది. ఆ తర్వాత వరికొద్ది సేపటికి పుట్టలో నుంచి పాము వచ్చి పడగ కూడా విప్పింది. దీనికి సంబంధించిన దృశ్యాలు కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఘటనను దగ్గరే ఉండి తిలకించిన భక్తులు హరహర మహాదేవ అంటూ శివనామ స్మరణలో మునిగిపోయారు. కొంతమంది భక్తులు సాక్షాత్తు నాగేంద్రుడే దర్శనమిచ్చాడని చెప్పుతూ వచ్చారు. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి