)
Huge Python Viral Video Watch Here: ప్రపంచంలో అత్యంత పెద్ద పాముల్లో పైథాన్ జాతికి సంబంధించిన పాముల జాతి ఒకటి.. ఇవి చూడడానికి భారీ శరీరాన్ని కలిగి ఉంటాయి. అంతేకాకుండా శక్తివంతమైన కండరాలను కలిగి ఉంటుంది. దీంతో పాటు చాలా నెమ్మదిగా ఒకచోటు నుంచి మరొక చోటికి ప్రయాణం చేస్తాయి. అలాగే విభిన్న కలర్స్ ఈ పాములు కనిపిస్తూ ఉంటాయి. అప్పుడప్పుడ సోషల్ మీడియాల్లో వీటికి సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఓ పెద్ద పైథాన్ జాతికి పాముకు సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది.
ప్రస్తుతం భారీ జాతికి పైథాన్ ఇంటి లోపల తీరుగుతున్న దృశ్యాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఒక భారీ పైథాన్ స్నేక్ ఇంటి లోపల కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వీడియో వివరాల్లోకి వెళితే, ఈ పాము ఒక అద్భుతమైన రంగు కలిగిన దుప్పటిపై నెమ్మదిగా పాకుతూ కనిపించింది. నెమ్మదిగా పాకుతున్న ఆ పామును ఒక చిన్న పిల్లోడు దానిని పట్టుకోడం మీరు చూడొచ్చు. ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు భయాందోళనలకు గురవుతున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను అక్కడే ఉన్న ఒకరు స్మార్ట్‌ఫోన్‌లో చిత్రీకరించారు. అయితే, ఈ వీడియో చూసిన చాలా మంది ఈ పాము అడవుల నుంచి వచ్చింది కాదని, వారే దానిని చిన్నప్పటి నుంచి పెంచుకుంటున్నారని చెబుతున్నారు. ఆ పాము వీడియో చివరిలో బ్లాంకెట్ నుంచి కిందికి దిగి.. నేలమీద పాకుతూ కనిపించింది. ఈ పాము దాదాపు 21 అడుగులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ అయ్యింది. ఇప్పుడు ఈ ఘటనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోను @jaysreptiles5457 అనే యూట్యుబ్ ఛానెల్ నుంచి పోస్ట్ చేశారు. ఇప్పటి వరకు ఈ వీడియోను కొన్ని వేల మందికి పైగా సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించారు. ఈ వీడియో చూసిన కొంతమంది సోషల్ మీడియా వీనియోగదారులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి