
Baby King Cobras Rare Video: సాధారణంగా పాములు ఎంత ప్రమాదకరమో అందరికీ తెలుసు. అందుకే చాలామంది వీటిని చూడగానే పరిగెత్తుతూ ఉంటారు. కాని పాములు పట్టేవారు అలా కాదు, వారు ఎంత ప్రమాదకరమైన పామునైన ఎంతో సాహసం చేసి దానిని పట్టుకుంటారు అంతే కాకుండా అది దాడి చేసిన ఏ మాత్రం భయపడకుండా పట్టుకునే ప్రత్యేకమైన సామర్ధ్యాన్ని కలిగి ఉంటారు. అయితే ప్రస్తుతం చాలామంది పాములు పట్టేవారు పాములను రక్షించే క్రమంలో వాటి గుడ్లను సేకరించి, పిల్లలయ్యేవరకు ఇళ్లలోనే ఉంచుకుంటున్నారు. ఆ గుడ్లు పిల్లలుగా మారిన తర్వాత అడవుల్లో సురక్షితంగా వదిలేస్తున్నారు.. అయితే ఇటీవల క్యాచర్ పాము పిల్లలకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారింది.
వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి బేబీ కింగ్ కోబ్రాలను ఒక తట్టలో ఉంచడం చూడొచ్చు. ఆ వ్యక్తి వందలాది బేబీ కింగ్ కోబ్రా పిల్లలను ఒక వైపుకు జరిపి ఆ బౌల్‌ని ఏదో పేపర్‌తో తుడుస్తున్నాడు. ఆ పాము పిల్లలు కదులుతూ మెలికలు తిరుగుతూ ఉండడం కూడా మీరు క్లియర్‌గా గమనించవచ్చు. అంతేకాకుండా ఈ తట్టలో పాము పిల్లలని ఒకే రంగులో ఉన్నాయి. అయితే ఆ వ్యక్తి ఎలాంటి భయం లేకుండా అతి ప్రమాదకరమైన బేబీ కింగ్ కోబ్రా పిల్లలను అటూ ఇటూ చేతులతో తాకుతూ ఒక సైడు నుంచి మరో సైడు కదుపుతున్నాడు. ఇలా చేస్తున్న సమయంలోనే ఒకరు ఈ దృశ్యాలను స్మార్ట్ ఫోన్ లో చిత్రీకరించి పోస్ట్ చేశారు.
ఈ పాము పిల్లలకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన వారు వారి అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలుపుతున్నారు. అయితే అప్పుడే జన్మించిన పిల్లలు ఎలాంటి విషయాన్ని కలిగి ఉండవట అందుకే అతడు ఆ పిల్లలను అటు ఇటు చేతులతోనే ముడుతూ కదుపుతున్నాడు. సాధారణంగా కింగ్ కోబ్రా పిల్లలకు విషం పుట్టిన ఏడు నుంచి పది రోజుల్లో ఉత్పత్తి అవుతుందట. ఆ సమయం వరకు పిల్లలు దాడి చేసినప్పటికీ ఒంట్లోకి విషం ప్రవేశించదని కొంతమంది చెబుతున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ వైరల్ అవుతున్న వీడియోను సర్పమిత్ర సాల్వే అనే యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు. ఈ వీడియోను చాలామంది వీక్షించినట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి