)
Hundreds Of Snakes Video Watch Now: గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో షార్ట్ వీడియోస్ ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా జంతువులు, పాముల షార్ట్ వీడియోలు ఎక్కువగా జనాలు చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగానే పాముల వీడియోలు ఎక్కువగా చూస్తున్నారు.. దీంతో వాటికి సంబంధించిన వీడియోలు విపరీతంగా వైరల్ అవుతూ వస్తున్నాయి. తాజాగా . 'మురళీవాలే హౌస్లా' అనే యూట్యూబ్ ఛానెల్ నుంచి పోస్ట్ చేసిన పాములకు సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది. ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలేంటో? మనం ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా పాములను చూస్తేనే ఎంతో భయపడిపోతూ ఉంటారు.. అలాంటిది వందల అది పాములను ఒక్కసారి చూస్తే సంగతేంటి మరి.. అవును ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో ఒక పాడుబడ్డ బావిలో వందలాది పాములు గుంపు గుడి ఉన్నాయి. అంతేకాకుండా ఈ పాములను రెస్క్యూ చేసేందుకు మురళీవాలే అక్కడికి చేరుకుంది. అందులో ప్రముఖ స్నేక్ క్యాచర్ ఒకరు ఆ బావిలోకి దిగారు. అందులో ఉన్న పాములను అతడు ఒక్కొక్కటిగా పట్టుకొని డబ్బులు బంధించడం మీరు చూడొచ్చు. ఇలా అతను చాలా పాములను పట్టుకొని దెబ్బలను బంధించి వాటిని పైకి తీసుకువచ్చారు.
ఆ రెస్క్యూ బృందం డబ్బాలో పాములను పాడుబడ్డ బావిలో నుంచి బయటికి తీసుకువచ్చి.. ఒకచోట పెట్టారు. అయితే, ఈ దృశ్యాలను చూసేందుకు ఆ బావి దగ్గరికి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న చాలామంది తరలివచ్చారు. ఈ బృందంలోని ఒక తమ స్మార్ట్ ఫోన్స్‌లో వీడియోను చిత్రీకరించి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోనే వైరల్ అవుతుంది. ఇలా అన్ని ప్రమాదకరమైన పాములను పట్టుకోవడానికి తప్పకుండా ఎంతో కొంత నైపుణ్యం అవసరం ఉంటుంది.
ఈ వారిలో ఉన్న వీడియోకు ఒక హిందీ పాటను జోడించి సోషల్ మీడియాలో వదిలారు. దీంతో వీడియోలో ఉన్న పాట రెస్క్యూ ఆపరేషన్‌కి సంబంధం ఉండడంతో చాలామంది ఈ వీడియోని ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటివరకు ఈ వీడియోను కొన్ని లక్షల మంది వీక్షించారు. అంతేకాకుండా ఈ వీడియోను కొన్ని వేల మందికి పైగా షేర్ చేసినట్లు తెలుస్తోంది. కొంతమంది ఈ వీడియోను చూసి కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇలాంటి అద్భుతమైన వీడియోలు మరిన్ని షేర్ చేయాలని కోరుకున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి