Hundreds Black Cobras Viral Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో షార్ట్ వీడియోలు ఊహించని స్థాయిలో వైరల్ అవుతున్నాయి. చాలామంది ఎక్కువగా ఫుల్ వీడియోలకు బదులుగా షార్ట్ వీడియోలనే చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా ఇందులో జంతువులకు సంబంధించిన వీడియోలను అయితే సోషల్ మీడియా వినియోగదారులు తప్పకుండా వీక్షిస్తున్నారు. వీటికి ఎక్కువగా వ్యూస్ వస్తున్నాయి. అరుదైన జంతువులు, కామెడీ సన్నివేశాలు, రొమాన్స్ వీడియోలను సోషల్ మీడియా వినియోగదారులు విపరీతంగా వీక్షిస్తున్నారు. ముఖ్యంగా కొంతమందైతే నాగుపాముల వీడియోలను చూసేందుకు కూడా ఎంతో ఆసక్తి చూపుతున్నారు. కొంతమంది వన్యప్రాణి సంరక్షకులు షేర్ చేసే నాగుపాము వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతున్నాయి.
తాజాగా కూడా కొన్ని నాగుపాములకు సంబంధించిన ఓ అత్యంత అరుదైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను VenomEye TV అనే యూట్యూబ్ ఛానల్ నుంచి సోషల్ మీడియాలోకి పోస్ట్ చేశారు. ఈ వీడియోలో కింగ్ కోబ్రాలు ఆన్ డ్యూటీలో ఉన్నాయని క్యాప్షన్ పెట్టి పోస్ట్ చేశారు. వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. ఒక నది నడి ఒడ్డున అత్యంత ప్రమాదకరమైన నాగుపాములు వాటి పిల్లలు వడగవిప్పి కూర్చొని ఉండడం మీరు చూడవచ్చు. ఈ వీడియోలో నాగుపాము పిల్లలు అటు ఇటు పాకడం కూడా గమనించవచ్చు..
9 సెకండ్ల నిడివి గల ఈ వీడియోలో విశాలమైన పచ్చిక మైదానంలో పాములు అటూ ఇటూ తిరగడం చూస్తున్న సోషల్ మీడియా వినియోగదారులు ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా ఒకే చోట ఇన్ని పాములు ఉండడం చూసి షాక్ అయిపోతున్నారు.. సాధారణంగా అడవి ప్రాంతాల్లో ఒకే చోట పదుల సంఖ్యలో పాములు నివసిస్తూ ఉంటాయి. అందులో భాగంగానే ఈ నది ఒడ్డున పదుల సంఖ్యలో పాములను చూడొచ్చు. ఈ వీడియోలో పాములు నలుపు రంగులో కూడా కనిపించడం మీరు గమనించవచ్చు.
Also Read: Giant Rock Python Video: ఆవుల పాకలో 9 అడుగుల రాక్ పైథాన్ కలకలం.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు!
సాధారణంగా ఇలాంటి పాములు ఉన్నచోట చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా అడవి ప్రాంతాల్లో తిరిగే వన్యప్రాణి సంరక్షకులు తప్పకుండా ఒకటికి రెండుసార్లు చూస్తూ ముందుకు వెళ్లడం మంచిదని ఈ వీడియో చూసిన కొంతమంది చెబుతున్నారు. అయితే ఈ వీడియోలో ఉన్న పాములు నిజమైనవి కాదని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సృష్టించిన వీడియో అని మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ వీడియోను క్లియర్గా చూస్తే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సృష్టించిన వీడియో అని అర్థమయిపోతుంది.
Also Read: Giant Rock Python Video: ఆవుల పాకలో 9 అడుగుల రాక్ పైథాన్ కలకలం.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









